Vijayashanthi

 

హుజూరాబాద్‌లో మిగతా కులాలు లేవా.? – విజయశాంతి

 

🔹దళితేతర 70వేల మంది ఓటర్ల కేసీఆర్‌ను నిలదీయాలె

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అనివార్యమే అయినా, అధికారిక ప్రకటన రాకముందే హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి పీక్స్ కు చేరింది. దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకుంటుండగా, గతంలో ఆయన దళితులకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ విపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సోమవారం అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు కీలక ప్రశ్నలు సంధించారు. దళిత బంధును మెచ్చుకుంటూనే, దళితేతర కులాల మాటేమిటని నిలదీశారు. అనివార్యమే అయినా, అధికారిక ప్రకటన రాకముందే హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి పీక్స్ కు చేరింది. దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకుంటుండగా, గతంలో ఆయన దళితులకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ విపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సోమవారం అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు కీలక ప్రశ్నలు సంధించారు. దళిత బంధును మెచ్చుకుంటూనే, దళితేతర కులాల మాటేమిటని నిలదీశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయం. అయితే, గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం, దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా ఊడపీకడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ ను నమ్మే పరిస్థితులు లేవు. అట్లనే దళిత బంధు పథకానికి కేవలం రూ.1200 కోట్లు కేటాయించి, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పబోనని సీఎం కేసీఆర్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ విషయంలో 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పలేదని తప్పించుకున్న ఘనత ఈ సీఎంది. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ళు మొత్తం డిమాండ్‌కు చాలినన్ని కట్టలేని ఈ ప్రభుత్వం వెళుతున్న వేగానికి మరో 60 ఏళ్ళు పట్టేట్టుంది. ఇప్పుడు దళిత బంధు పథకానికి కూడా వీరి కేటాయింపులను బట్టి చూస్తే 160 సంవత్సరాలు పట్టవచ్చు.

ఇకహుజురాబాద్ ఎన్నికల కోసము దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ పెట్టినం, ఇది పక్కాగా ఎన్నికల్లో ఓట్ల కోసమే చేస్తున్నామని సీఎం స్వయంగా చెబుతున్నాడు. ఇది ఓట్ల పథకం అయినప్పుడు, ఆ నియోజకవర్గంలోని మిగతా కులాలకు చెందిన సుమారు 70 వేల పైచిలుకు కుటుంబాల మాటేంటి? వాళ్లకు కూడా ఇలానే తలా రూ.10 లక్షల చొప్పున నిధుల కేటాయింపు ఎందుకు చెయ్యలేదు? వారు మీ ప్రజలు కాదా? వారివి ఓట్లు కావా? ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చామన్న టీఆర్ఎస్ పార్టీ నేతలను హుజూరాబాద్ లోని మిగతా వర్గాలు నిలదీయాలి. ఇతర కులాలకూ సీఎం నిధులు ప్రకటించేలా ఒత్తిడి చేయాలి. స్పష్టమైన దళిత సాధికారతను, దళిత బంధును మనస్ఫూర్తిగా స్పాగతించి తీరుతం. అయితే, ఓట్ల పథకమన్నప్పుడు దానిపై హుజురాబాద్‌లో అన్ని సామాజిక వర్గాల వారికీ హక్కు ఉంటుంది” అని విజయశాంతి పేర్కొన్నారు.