దిగ్విజయంగా అంతరిక్షయానం
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. తెలు
అంతరిక్ష టూరిజం
అంతరిక్షయానికి వెళ్లే ముందు బండ్ల శిరీష ట్వీట్ చేశారు. ‘‘అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీలో, యూనిటీ-22 సిబ్బందిలో భాగస్వామి కావడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇక, ఈ అంతరిక్ష ప్రయాణంలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్‌సన్ టికెట్ కొనుక్కొని యాత్ర చేస్తున్న ఒక ప్రయాణికుడిలా వ్యవహరించనున్నారు. భవిష్యత్‌లో వెళ్లబోయే అంతరిక్ష పర్యాటకులకు ఆ యాత్ర జీవితకాల అనుభూతిగా మిగిలిపోయేలా చూసేందుకు అవసరమైన మార్గాలను ఆయన అన్వేషిస్తారు. ఈ యాత్రలో అందరూ సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వర్జిన్ గెలాక్టిక్ ముఖ్య వ్యోమగామి శిక్షకురాలు బెత్ మోసెస్‌ది. వ్యోమనౌకలోని క్యాబిన్ పనితీరును పరిశీలించి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ఆధునికీకరణలను గుర్తించే బాధ్యత ముఖ్య ఆపరేషన్స్ ఇంజినీర్ కాలిన్ బెనెట్‌ది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్‌కు 2.5 లక్షల డాలర్ల చొప్పున చెల్లించి తమ సీట్లను రిజర్వు చేసుకోవడం గమనార్హం.