CM Revanth Reddy invited to Yadagirigutta Brahmotsavam
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట (ప్రశ్న న్యూస్) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మర్యాద పూర్వకంగా కలసి అందజేశారు.
అదేవిధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మినిస్టర్ క్వాటర్స్ లో పలువురు మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను కలసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలుకు ఆహ్వానించారు అందజేశారు.
Also Read : Shivalayam Lo Niluvu Dopidi
వీరితో పాటు యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, యాదాద్రి మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ ఈవో రామకృష్ణ రావు, ఆలయ ప్రధాన అర్చకుడు నల్లంధిగల్ నరసింహచార్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.