పేదరికాన్ని పెంచి పోషిస్తున్న మన పాలకులు: ప్రో.కోదండరాం
* పేదలని మరింత పేదలుగా మారుస్తున్న వైనం
* పేదలకు పూర్తిగా అందని సంక్షేమ పథకాలు
* ఇక ఎంత కాలం ఈ పేదల పై ఈ వివక్ష
* పేదలను దోచి బడా బాబులకు పెట్టడమే మీ నైజంమా.?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాజకీయ చదరంగం లో పాలకుల కుట్రల ములంగా పేద ప్రజలు మరింత పేదరికం లోకి నెట్టి వేయ బడుతున్నారని, ఉద్ద్యేశ పూర్వకంగానే పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండు పేదరికం పై చట్ట సభల్లో చట్టాలు చేసి ప్రతి సంవత్సరం లక్షల కోట్లు ఖర్చు చేసి ఎంత మంది పేదలని ఉద్దరించారని, పేదల పేరుతో ఖర్చు చేస్తున్న డబ్బంతా ఎటు పోతుందని ప్రశ్నించారు. కల్లబోల్లి కబుర్లు చెప్పి అరచేతిలో స్వర్గం చూపిస్తు పేద ప్రజ అబివృద్ది పేరున సంక్షేమ పథకాలు ప్రకటిస్తు ఆచరణకు ముందే బుట్ట ధఖలు చేసి వారి ఉన్నతిని తోక్కి పెట్టి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇక నేడు విద్యా వైద్యం, న్యాయం వంటి కనీస అవసరాలను కూడ పేద ప్రజలకు అందుబాటు లేకుండాఎల్ల కాలం దారిద్రపు రేఖకు దిగువన వుండేటట్లు రాజకీయ కుట్రలు చేస్తు వీరి అమాయకత్వాని అసరగా చేసుకొని వీరికి రాజ్యాధి కారాని దూరం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నను దేశం లో ధనవంతులు మరింత అభివృద్ది చెందగా పేదలు మరంత పేదలుగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కార్పోరేట్ వ్యవస్థల కొమ్ముకాస్తు పేదప్రజల కడుపు కొడుతున్నాయి. అబివృద్ది ముసుగులో కోట్లకు కోట్లు అప్పులు తెచ్చి కమీషన్ల దండుకొని పేదప్రజల నెత్తిన అప్పుల బారం వేస్తున్న ఈ దళారీ ప్రభుత్వాల వల్ల పేదల బ్రతుకు ఏలా మారతాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. ఇక మన రాష్ట్రం లో అహంకార పూరిత అవినీతి మయ పాలనలో పేద ప్రజల బ్రతుకు అద్వన్నంగా మారాయని ఉపాధి,సంక్షేమ పథకాల అమలును ఉధ్యేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తు తమ మనుగడకు కుట్ర పూరితంగా ఉచితాల తో ప్రజలను మభ్యపెడుతు పబ్బం గడుపు కుంటున్నారని ఆక్రోశం వెళ్ళగక్కారు. రాష్ట్రం లో వ్యవస్థలు నిర్వీర్య మయాయని తమ ప్రాబల్యానికి రైతుల ఆత్మ హత్యలు, కార్మికుల కష్టాలు, నిరుద్యోగుల ఆత్మ హత్యలు, ఉపాద్యాయ, ఉద్యోగులపై కక్ష సాదింపులు పెరిగాయని విమర్శించారు. ఇక తన ప్రాబల్యనికి అవరోదమని రాష్ట్ర సాదనలో పోరాడిన ఉద్యమకారుల అణచివేత ఇక ప్రాణ త్యాగం చేసి అమరులైన వారి గుర్తింపును చెరిపివేస్తు, వారి కుటుంబాలను సైతం బజారు పాలు చేయడమే కాక ఆంధ్ర పాలకుల బూట్లు నాకుతు ఉద్యమకారులపై దాడులు చేసి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తోత్తుగాళ్ళకు పదవులిచ్చి పక్కన కూర్చోపెట్టుకోవడం తో “నవ్వినోని ముందు కాలు జారిపడినట్లు” గా మారిందని కోదండరాం విరుచుకు పడ్డారు. నాయకుల మోసపూరిత ప్రకటనలు, మభ్యపెటే హమీలకు అకర్షితులై అధికారం అప్పచెబితే ఐదు సంవత్సరాలు అనుభవించా ల్సిందే నని ప్రతి ఒకరు నేటి ప్రజా కంఠఖ పాలనను, పాలకుల జమ్మికులను గమనించాలని, పేద,దళిత, బడుగు, బలహీనవర్గాల ప్రజల ఏకమై ప్రజా వ్యతిరేఖ పాలకులకు చంప చెల్లుమనే గుణపాఠం చెప్పలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రో.కోదండరాం కోరారు.