సకలజనులు కోట్లాడి తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా.? – ప్రొ.కోదండరాం
* మన ఓట్లతో అధికారం అనుభవించే కేసీఆర్ మన సమస్యలెందుకు వినడు.?
* ప్రజెక్టులు, పైపులైన్లు కేసీఆర్ ఫాంహౌజ్ నుండి పోతే ఉరుకుంటాడా.?
* రైతులంతా ఐక్యమత్యంగా కలిసి పోరాటం చేయాలి
* రైతు సమస్యలపై తగిన న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం
జగిత్యాల (ప్రశ్న న్యూస్) సకల జనులం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మన వోట్లతో గెలిచి రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మనం చెబితే వినకపోతే ఎలా అని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరాం ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల పరిధిలోని జగదేవునిపేట గ్రామంలో జరిగి రైతుల సమావేశంలో పాల్గోన్న అయమ మాట్లాడుతు అరెస్టులు, అనేక రకాల పోలీస్ నిర్బంధాల మధ్య రైతుల సమావేశం విజయవంతంగా కొనసాగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ -2 పైపు లైన్ తో భూములు కోల్పోతూ నష్ట పరిహారం అందని రైతులతో ఆయన సమావేశమయి వారి సమస్యలను, బాధలను, రైతులు వెళ్లబోసుకున్న గోడును కోదండరామ్ విన్నారు. ఈ సందర్బంగా రైతుల నుండి వాస్తవాలు సేకరించారించి. ఈ భూమి మనది, బెదిరించి భూమి లాక్కునే హక్కు ఈ ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేశారు. 2013 లో వొచ్చిన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు రైతులు భూమి ఇవ్వకపోతే భూమిని గుంజుకునే హక్కు గాని, రైతులు వద్దంటే ప్రాజెక్టులు నిర్మించే హక్కు గానీ ఈ ప్రభుత్వాలకు లేదన్నారు. రైతుల సమ్మతితోనే, అది కూడా ప్రైవేట్ మార్కెట్లో ఉన్న రేటుకు మూడు రెట్లు ధర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుండి భూమి పొందిన తరువాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని కోదండరామ్ తెలిపారు.
ఇదే ప్రాజెక్టులు, పైపు లైన్‌లు కెసిఆర్ భూముల గుండా, ముఖ్యమంత్రి చుట్టాలు, ఆయన దోస్తుల భూముల నుండి, వారి పామ్ హౌజ్‌ల నుండి పోతే ఊరుకుంటారా అని కోదండరామ్ ప్రశ్నించారు. తుట్టికి పావుసేరు ధరలకు మనం ప్రభుత్వానికి, ప్రాజెక్టులకు, పైపులైన్‌లకు భూములు ఇచ్చి నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు. చట్టపరంగా రైతులకు భూమికి బదులు సరైన భూమి, లేదా తగిన ప్రైవేట్ మార్కెట్ ధరకు మూడొంతలు చెల్లించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేసారు. రైతలంతా ఐకమత్యంగా కలిసి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల వెంట ఉండి తగిన న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని కోదండరామ్ రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ వాదులచే రైతులకు జరిగే నష్టంపై మాట్లాడుకొని తగు చట్టపరమైన న్యాయ పోరాటం చేద్దామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ విడిపోవద్దని, ఐకమత్యంగా పోరాడితే తప్పకుండా చట్టపరంగా న్యాయం జరిగి తీరుతుందని ధైర్యం చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జనసమితి పార్టీ ధర్మపురి, కోరుట్ల, నియోజకవర్గాల ఇంచార్జ్ లు రామగిరి సంతోష్, కంతి మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, జిల్లా కార్యదర్శి శంకర్, బిజెపి నాయకులు కొమ్ము రాంబాబు, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపలుకుల వెంకట్, రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎరుకల రాజన్న, దళిత లిబరేషన్ ప్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు, బాధిత రైతు సమన్వయ సమితి నాయకులు బచ్చల స్వామి తదితరులు హాజరై ప్రసంగించారు. జగదేవుపేట్, కొండాపూర్, చెందోలి, లక్ష్మిపూర్, దమ్మన్నపెట్, చర్లపల్లి గ్రామాల బాధిత రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం రైతుల భూముల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పైపులైన్ పనులను కోదండరాం పరిశీలించారు.