ప్రధాని మోదీ జంబో క్యాబినెట్
🔹కొత్త టీం ప్రమాణ స్వీకారం, సీనియర్లకు షాక్
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ కేంద్ర మంత్రులు సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. సుమారు 12 మంది సీనియర్ మంత్రులు రాజీనామాలు సమర్పించారు. మోదీ కొత్త టీం ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తోంది. సుమారు 43 మందితో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేస్తున్నారు. వారిలో నలుగురు మాజీ సీఎంలు ఉండడం గమనార్హం. ఈ సారి కేంద్ర క్యాబినెట్‌లో మహిళలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. 11 మంది మహిళలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించారు. యూనియన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది నేతల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తొలుత నారాయ రాణే కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన ఎల్జేపీ నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పారస్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి క్యాబినెట్‌లో చోటుదక్కించుకున్నారు.
కొత్త మంత్రులు వీరే..
1. నారాయణ రాణే 2. సర్బానంద్ సోనోవాలా 3. డాక్టర్ వీరేంద్ర కుమార్ 4. జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్ర ప్రసాద్ సింగ్ 6. అశ్వనీ వైష్ణవ్ 7. పశుపతి కుమార్ పారస్ 8. కిరణ్ రిజిజు 9. రాజ్ కుమార్ సింగ్ 10. హర్దీప్ సింగ్ పూరీ 11. మన్సుఖ్ మాండవ్య 12. భూపేందర్ యాదవ్ 13. పురుషోత్తం రూపాలా 14. కిషన్ రెడ్డి 15. అనురాగ్ ఠాకూర్ 16. పంకజ్ చౌధురి 17. అనుప్రియా పటేల్ 18. సత్యపాల్ సింగ్ బాఘేల్ 19. రాజీవ్ చంద్రశేఖర్ 20. శోభా కరంద్లాజే 21. భానుప్రతాప్ సింగ్ వర్మ 22. దర్శన విక్రమ్ జర్దోశ్ 23. మీనాక్షి లేఖీ 24. అన్నపూర్ణా దేవి 25. నారాయణ స్వామి 26. కౌశల్ కిశోర్ 27. అజయ్ భట్ 28. బి.ఎల్. వర్మ 29. అజయ్ కుమార్ 30. చౌహాన్ దేవూసింగ్ 31. భగవంత్ ఖూబా 32. కపిల్ మోరేశ్వర్ పాటిల్ 33. ప్రతిమా భౌమిక్ 34. భగవత్ కృష్ణారావు 35. సుభాశ్ సర్కార్ 36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్ 37. భారతీ పవార్ 38. విశ్వేశ్వర్ తుడు 39. శంతనూ ఠాకూర్ 40. మహేంద్ర భాయ్ 41. జాన్ బర్లా 42. మురుగన్ 43. నితీశ్ ప్రామాణిక్.