మైనంపల్లి నీ అంతు చూస్తాం – బండి సంజయ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బండి సంజయ్ వార్నింగ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీజేపీ జాతియ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. నేటి నుండి హనుమంతరావు అంతు చూస్తామంటూ హెచ్చరించాడు. గుండాయిజంతో రాజకీయాలు చేస్తున్న మైనం జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
మల్కాజిగిరి (ప్రశ్న న్యూస్) హైదరాబాద్ మల్కజ్‌గిరిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ ,బీజేపీ నేతల మధ్య ఉదయం ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే బీజేపీ స్థానిక కార్పోరేటర్ శ్రావణ్‌కు గాయాలు కావడంతో చికిత్స పోందుతున్నాడు..దీంతో పార్టీ అధినేత బండిసంజయ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు. కాగా కార్పోరేటర్‌తో పాటు మహిళ కార్పోరేటర్లు, కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ దాడికి కారణం ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కారణమంటూ ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆయన గుండాయిజంతోపాటు దాడులతో రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టాడు. గతంలో మైనం పల్లి బీజేపీలో చేరుదామని వస్తే తామే తరిమికొట్టామని చెప్పారు. మైనంపల్లి డబ్బు ,గుండాయిజంతో రాజకీయం చేస్తుంటే.. తాము పార్టీ జెండాలతో పోరాడుతున్నామని అన్నారు. ప్రభుత్వాలు ఎమ్మెల్యే పదవులు శాశ్వతం కాదని త్వరలోనే ఆయన అక్రమాలను బయట పెట్టి అంతు చూస్తామని హెచ్చరించారు. ఇక కార్పోరేటర్లపై దాడులు జరుగుతుంటే చూస్తున్న పోలీసుల పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపిని కోరారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. లేదంటే తమ సత్తా చూపుతామని అన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల జరుగుతున్న వేళ నగరంలోని మల్కజ్‌గిరిలో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య అంతర్గత విభేధాలు బయటపడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం మల్కాజ్‌గిరిలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కాగా ఈ సంఘటన మల్కజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హానుమంతరావుతో పాటు స్థానిక బీజేపీ కార్పోరేటర్ శ్రావణ్ కూడా పాల్గొన్నారు..కాగా దాడిలో కార్పోరేటర్ శ్రావణ్ కాలికి గాయం కావడంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Related posts:
సంక్షేమ ఫలాలు అందరికీ, సమస్యలపై పోరుబాట
గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
గాలిని కూడా అమ్ముతారో ఏమో..
హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.500 కోట్లు
ఇక ఇంటింటికీ ‘దిశ’
రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన...
ఎత్తులకు పై ఎత్తులతో వేడేక్కిన హుజూరాబాద్ రాజకీయం
కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా