రాజధాని తరలింపుకు ముహూర్తం ఫిక్స్..?
🔹సీఎం జగన్ వైజాగ్ వెళ్లేది అప్పుడేనా..?
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాజకీయ వర్గాల్లో నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా మరోక ఆసక్తికర చర్చ బయటకు వచ్చింది. ఎప్పుడెప్పుడా అని చర్చించుకున్నంటున్న అంశంపై త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రకటించిన తరువాత నుంచి వైజాగ్ నుంచి పరిపాలన సాగించడంపై ఉత్కంఠ నెలకుందనే అనుకోవాలి. ఈరోజు రేపు అంటు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే జూలై మొదటి వారం నుంచి జగన్ వైజాగ్ వేదికగా పరిపాలన కొనసాగించబోతున్నట్లు పార్టీ వర్గాల తోపాటు ప్రభుత్వ వర్గాలు కూడా చెబుతున్నాయి. తొలిత జూన్ మొదటి వారం నుంచి అనుకున్నప్పటికి కొన్ని కారణాల వలన అది సాధ్యం కాలేదు. అయితే జూలై మొదటి వారంలో మాత్రం అక్కడి జగన్ వెళ్లిడం పక్క అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు కొన్ని కీలక శాఖలు కూడా వైజాగ్ కు తరలివెళ్లబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వైజాగ్ లో అత్యంత ఖరీదైన ఒక వెల్నెస్ సెంటర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు వివిధ శాఖలు తరలించడానికి కొన్ని భవనాలను కూడా ప్రభుత్వం సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రితో ఏ శాఖలు వెళ్లాలి అనేదానిపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఉండడానికి అనువైన ప్రాంతం తోపాటు సమావేశాలు నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఉన్న ప్రాంతాన్నే ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే వైజాగ్ మళ్లి తరలివెళ్లడం పట్ల ఉద్యోగ సంఘల్లో కొంత మంది వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ కు తరలి వెళ్లడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు జూలై మొదటి వారంలో అయిన జగన్ తను అనుకున్న విధంగా వైజాగ్ నుంచి పరిపాలన చేయగలగుతారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఈ జూలై మొదటి వారంలో సీఏం అక్కడికి వెళ్లడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అధికారులకు ఇవే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ముఖ్యమంత్రికి నివాసంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యకాలాపాలను ఎంపీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు సమచారం.