వారికి రూ. 10 వేలు ఇవ్వని కేసీఆర్.. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తారా.?

 

మూడు చింతలపల్లి (ప్రశ్న న్యూస్) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెపట్టిన దళిత ఆత్మగౌరవ దీక్ష ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగుతోంది..దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో భాగంగా ఆయన రెండు రోజుల పాటు దీక్ష చేపట్టారు.ఉదయం హైదరాబాద్‌ నుండి మూడు చింతలపల్లి సభా స్థలికి ఉదయం భారీ కాన్వాయ్‌తో ర్యాలీ కొనసాగింది..మధ్యలో గండిమైసమ్మ వద్ద ఆగిన రేవంత్ రెడ్డి ఆగి ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే దళిత,గిరిజన నాయకులతోపాటు సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతోపాటు మధుయాష్కిగౌడ్, మహేశ్వర్ రెడ్డి,తోపాటు మాజీ టీపీసీసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్థానిక నేతలు సభలో పాల్గొన్నారు..ఇక రోటిన్‌గానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనలేదు.కాగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకురావడంతోపాటు ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.. టీఆర్ఎస్‌లోనే దళితులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌లో ఎన్నికలు వచ్చాయి కాబట్టి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం కింద రూ. 10 లక్షలు ఇస్తామంటున్నారమని ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ. 10 వేలు ఇవ్వని కేసీఆర్.. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తాడా ? అని ప్రశ్నించారు. మూడు చింతలపల్లిలో చేపట్టిన రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతిసారి తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ అంటున్నారని.. అలాంటప్పుడు ఉద్యోగులకు జీతాలు ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో 22 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని.. కేసీఆర్ ఇచ్చే డబ్బులను హుజూరాబాద్ దళిత బిడ్డలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రమంతా దళితబంధు ఇప్పించే బాధ్యత హుజూరాబాద్ దళిత బిడ్డలు తీసుకోవాలని ఆయన కోరారు. మూడు చింతలపల్లి, కేశవపూర్, లక్ష్మాపూర్ గ్రామాలను సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారని..ఈ గ్రామాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారా ? అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ గ్రామాల్లో ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న చిన్న ముల్కనూర్‌లో నాలుగేళ్లయినా ఇంకా ఇళ్లు నిర్మించలేదని అన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో కేసీఆర్ దత్తత గ్రామం లక్ష్మాపూర్ లేనేలేదని రేవంత్ రెడ్డి అన్నారు. దత్తత గ్రామాలకు ఏం ఇచ్చాడో కేసీఆర్ చెప్పాలని సూచించారు. వివరాలు చెబితే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చాడని అన్నారు.

తెలంగాణ పల్లెలు కనిపించని కుట్రల్లో కన్నీరు పెడుతున్నాయని.. తెలంగాణలో ప్రజాప్రతినిధులెవరైరా ఆత్మగౌరవంతో బతుకుతున్నారా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బానిసలకంటే హీనంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఇస్తే కేసీఆర్ ప్రతి ఒక్కరిపై రూ. లక్ష అప్పు చేశారని అన్నారు. వచ్చే నెల గజ్వేల్ గడ్డ మీదకు వస్తానన్న రేవంత్ రెడ్డి.. అడ్డం వచ్చినవాణ్ణి తొక్కుకుంటూ వెళతానని వ్యాఖ్యానించారు. ఆడపిల్లల ఆత్మగౌరవం పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 150 మంది ఇంకా రోడ్డు మీద బతుకుతున్నారని అన్నారు. అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇచ్చినా.. లక్ష ఋణ మాఫీ చేసినా.. పంచాయతీ పెడదామని అన్నారు. అన్ని కులాల పెద్దలను కూడా పిలిచి చర్చిద్దాం అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో తెలంగాణ తల్లి బంది అయ్యిందని అన్నారు. కాంగ్రెస్ 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి.. పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్ష అప్పు పెట్టాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారం లో వుండగానే సబ్ ప్లాన్ తెచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.