అమ్మవారి నవదుర్గల అవతారాల్లో ఐదవ అవతారం స్కందమాత
5. స్కందమాతా
ఐదవ రోజు పంచమి లేదా నవరాత్రి 5వ రోజు దుర్గాదేవిని స్కంధమాత సరస్వతి దేవిగా అలంకరిస్తారు.
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని ‘స్కందమాత’పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, ‘పద్మాసన’ యనబడు ఈమెయు సింహవాహనయే.
స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు. సింహాం మీద కూర్చొని, ఎడు రకాల ఆయుధాలతో ఆమె ఎనిమిది చేతుల్లో ఉన్నట్లు అవతరిస్తుంది. ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పించుకుంటారు.
స్కందమాతా ధ్యాన శ్లోకం :
“ సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥