India Map

 

75 ఏళ్ళు గడిచిన అంతరించని పేదరికం

 

* స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా బాగుపడని బడుగు బ్రతుకులు
* ఉపాది అవకాశాలు మెరుగు పరిచేది ఎప్పుడు
*  విద్యా విదానం లో సహేతుకమైన మార్పులు చేసేది ఎప్పుడు
*  నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేది ఎప్పుడు
* పేద వారు మరింత పేదవారు గా మారుతున్న వైనం
* కార్పొరేట్ మాఫియాకు తలవంచిన దేశ రాజకీయాలు

 

(గౌటి రామకృష్ణ -ప్రశ్న న్యూస్ బ్యూరో) దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని అగ్ర రాజ్యాల ప్రక్కన చోటు సంపాదించుకున్నను దేశం లో ఇంకా పేదరికం అంతరించలేదని విచారం వ్యక్తం చేస్తున్న నాయకులు లేరు. గడిచిన 75 సంవత్సరాలలో రాజకీయాలు పూర్తిగా కలిషిత మయ్యాయి, కుంటుంబ ప్రీతి, అవినీతి,అక్రమ సంపాదన, స్వర్థం, చట్ట సభలకు నేరచరిత్ర ఉన్నవారు రావడం తో అభివృద్ది పూర్తిగా కుంటుపడి అభ్యున్నతికి అఘాతం లా పరిణ మించాయని మేధావులు విమర్శించారు. ఇక కార్పోరేట్ వ్యవస్థ కోరలు చాచి దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నభిన్నం చేస్తు అస్థిరత్వానికి గురిచేస్తున్నాయి. స్వార్థప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోని బడా బాబుల గులాములు గా మారిన మన పాలకులకు పేదల బ్రతుకు, వారి సంక్షేమం పై కనీసం కూడా ద్యాస లేదని అర్థమవుతుంది. పేదల సంక్షేమం పై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లైతే నేడు భారత్ లో పేదరికం అనే పదమే ఉండక పోయేదని అసహనం వ్యక్తం చేయవలసి వస్తుంది. పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను చట్ట సభలో ప్రవేశ పెట్టి కోట్లకు కోట్లు ఖర్చు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందని,మరి ఇంకా పేదరికం ఎందుకు పోవడం లేదని నిరుద్యోగులు ప్రశ్నించారు. పేదల పేరున డబ్బును పలహరంగా మెక్కి పేదలను మరింత పేదరికం లోకి నేట్టడం దురదృష్ట కరమని సామాన్యులు విమర్శించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి రాజ్యంగం కల్పించిన హక్కే రిజర్వేషన్ల విధానమని పేద దళిత బడుగు వర్గాలు పది సంపత్సరాల పాటు రిజర్వేషన్ విదానాన్ని పాటుంచి ఉన్నత స్థితికి చేరేందుకు వెసలు బాటు కల్పించిందని కాని మన పాలకుల అవనీతి అక్రమాల పుణ్యమా అని అట్టడుగు వర్గాలు నేటికి దారిద్ర్యరేఖకు దిగువనేఉన్నాయి. దేశం లో పేదరికం ను నాయకులే పెంచి పోషిస్తున్నారనడం లో ఆశ్చర్యం లేదని ప్రజలు దుయ్య బట్టారు. దేశలో అన్ని కులాలకు సంఘాలు ఉన్నను అగ్ర కులాల ఆగడాల వల్ల క్రింది స్థాయి కులాలకు సరైన ప్రోత్సాహం దక్కడం లేదని సామాన్యులు అక్రోశం వెళ్ళకక్కారు. ఇంకా ఎంత కాలం పేదరికాన్ని పెంచి పోషిస్తారని ప్రతి పౌరుడు ప్రశ్నించాలి. నేడు సమయానుకూలంగా పాలకుల నడవడిక, ఆదరబాదరగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశం లో ఆస్థిరత్వం పెరిగిందని, అస్తవ్వస్త విద్యావిధానం ,ఉపాది అవకాశాలు సన్నగిల్లడం , నిరుద్యోగులు పెరగడం, వంటి విషయాల పట్ల ప్రభుత్వం సరైన శాశ్వత చర్యలు చెప్పటక పోగ తాత్కాలిక ఉపశమనం కల్గచేసి సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయని నిరుద్యోగులు విరుచుకు పడ్ఢారు. ఇక కొన్ని రాష్ట్రాలు ఒక అడుగు ముందుకేసి ఉచితాలను ప్రకటిస్తు యువశక్తిని నీరుగార్చుతున్నాయని యువకులు అన్నారు. ఉచితాల పేరున ఖర్చు చేస్తున్న డబ్బును ఉపాది కల్పనకు ఖర్చు చేస్తే బావి తరాల వారికి కొంత ఉపశమనంగా ఉంటుందని అబిప్రాయపడుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాచి కొన్ని క్లాజులను తమకు అనుకూలంగా మార్చుకొని రాజ్యాంగానికి సవరణలు చేస్తు ప్రజాస్వామ్వన్ని నవ్వులపాలు చేస్తున్నారని యువకులు విమర్శించారు. సరైన ఉపాది అవకాశాలు కల్పించి విద్యవిదానం లో సహేతుక మైన మార్పులు చేసి నిరుద్యోగ సమస్యకు సరైన పరిష్కారం చూపిన నాడే అట్టడు వర్గాల వారు అభ్యున్నతి పోందుతారని మేధావులు సూచించారు.