Kodandaram

 

బంగారు తెలంగాణ నా.? లేక మత్తు తెలంగాణ నా.? – ప్రో.కోదండరాం

 

* విచ్చల విడిగా బెల్ట్ షాపులు

* వీదుల్లో ఏరులై పారుతున్న మద్యం

*  గడప గడప లో మహిళల ఆర్థనాధాలు

* ప్రస్తుతం మద్యం అమ్మకాలే రాష్ట్రనికి పెద్ద ఆర్ఠిక వనరులు

* మద్యం మత్తులో తూగుతు సంసారాల్లో చిచ్చు

* అక్రమాలపై దృష్టి మళ్ళించేందుకే మద్యం మత్తు

* త్వరలో మహిళలే  ఘోరి కట్టడం ఖాయం

* రాష్ట్రంలో కిరాతకంగా ప్రజాస్వామ్య ఖూనీ

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రం లో ప్రజలు మద్యం మత్తులో తూగుతు రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూర్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యలు, ఆభివృద్ది పేరున దుభారా ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక స్థితిని భృష్టు పట్టించి అప్పుల పాలు చేసి ప్రతి వ్యక్తి నెత్తిన లక్ష అప్పు భారం మోపి ఎవడిని ఉద్దరించారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు   ప్రో.కోదండరాం నిలదీసారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక మాదిరిగా, అధికారం దక్కిన తర్వాత మరో విధంగా  నక్కజిత్తుల వ్యవహరం తో రాష్ట్ర ఆర్థిక వనరులను కొల్లగొట్టి కుటుంబ ఖాతాలో జమ చేసుకుంటు ప్రపంచ ధనవంతులతో పోటి పడే స్థితికి చేరి రాష్ట్రాన్ని దివాలా తీయించారని విరుచుకు పడ్డారు.  అబద్దాల హమీలకు,  నక్కజిత్తుల వ్యవహరాన్ని నమ్మి నేడు యువత రోడ్డున పడ్డారని విమర్శించారు. ఉమ్మడి పాలకుల సమయంలో కూడా ఇంత దరిద్రపు పాలన లేదని విమర్శించారు. కుటుంబ సంక్షేమానికి స్వార్థ పూరిత కుట్రలతో, మోసపు ప్రకటనలతో ప్రజలను నమ్మించి నయవంచనతో తడిబట్టతో గోంతు కోయడం వెన్నతో పెట్టిన విద్యా అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసగించి కుటిల రాజకీయాలను చేస్తు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలకుల చెంత చేరి ఉద్యమానికి వెన్నుపోటు పోడిచిన వాళ్ళని దగ్గర తీసి అందలమ్మెక్కించడం తో ఉద్యమ చరిత్రను తుడిచే సాహసానికి బరితెగింపని,  కుట్రలను ప్రజావ్యతిరేక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని సమయానుకూలంగా దొంగలమూటా కు కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్దంగా ఉన్నారని కోదండరాం హెచ్చరించారు.
అవినీతి అక్రమ సంపాదనకు రాష్ట్ర ఆర్థిక వనరులన్ని నిర్వీర్యమయ్యాయని, నేడు రాష్ట్రలో కనీసం జీతాల ఇవ్వడానికి కూడ డబ్బులు లేవని, ఈ పరిస్థితులను బయటికి పోక్కకుండా ఉద్దెర హమీలతో ప్రజలను మభ్యపెడుతు ఖజానా ను నింపుకొవడానికి సుతిమెత్తగా పన్నులు వడ్డిస్తు, భూముల అమ్మకాల పేరుతో  అన్యయులకు విలువైన భూములను అప్పజెప్పడం వంటి నీతిభాహ్యమైన పాలన పట్ల ప్రజలు తీవ్ర అగ్రహంగా ఉన్నారని ఆక్రోశం వ్యక్తం చేసారు. ఇది ఇలా ఉండగా గత ఏడసంవత్సరాలుగా ఉద్యోగ ఖాళీ భర్తీ అంటు ఉకదంపుడు ప్రచారాలు చేసుకుంటు ఎన్నికలు వచ్చినప్పుడల్ల ధస్త్రానికి దుమ్ముదులపడం, మల్లీ మూలకు పడేయడంతో అర్హతలున్న నిరుద్యోగులు ఎంతో మంది ఏజ్ బార్ వల్ల అనర్హులుగా మిగిలి పోయారని మరి నీవిచ్చే ఉద్యగాలు ఎవరికి దక్కుతాయో.? అసలు  అధికారం చేపట్టింది  కుటుంబ సంక్షేమం కోసం దానికి కావలసింది ప్రజల ఓట్లు కావున ఓట్లు వస్తేనే నోట్లతో రాజకీయాలు చేస్తు ప్రజాస్వామ్యాన్ని అతి కిరాతకంగా హత్యచేసావని తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేసారు. ఇక రాష్ట్రం లో నియంతృత్వ చర్యలకు ఎంతో మంది మేధావులను, ప్రశ్నించే గొంతులను బలిచేస్తు, అణచి వేయడం వంటి దుర్మార్గాలు, రాష్ట్రాన్ని మత్తు లో ముంచి అవినీతి పాలన అక్రమాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే మద్యం షాపులకు విచ్చల విడిగా అనుమతులిస్తు మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని విమర్శించారు. అతి తొందరల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రో.కోదండరాం హెచ్చరించారు.