తూనికలు కొలతల శాఖా బ్రతికే ఉందా.?
* అడ్రస్ లేని అధికారులు – అడ్డు లేని మోసాలు
* మార్కెట్ మోసాలపై పర్యవేక్షణ ఏదీ.?
* విచ్చల విడిగా మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు.?
* తూకం వేసే మిషన్లల్లో సెట్టింగులు – కొనుగోలుదారుల జేబులకు చిల్లులు
ప్రతి వ్యాపారం లో ముఖ్యంగా వాడే సాధనాలు త్రాసు లేదా కొలత పావులు. మార్కెట్లల్లో ఏ వస్తువు కొన్నాలన తూకం వేయడం లేదా లీటర్ల లెక్కన తీసుకొవలసి ఉంటుంది. కాని వ్యాపారుల మోసాలతో తూకం వేసే మిషన్ల సెట్టింగ్ లో కిలో సరుకులు తీసుకుంటే ముప్పావు కిలో సరుకులే తూగడం తో కొనుగోలుదారులు పావు కిలో సరుకులను కొల్పో వలసి వస్తుంది. అలాగే లీటర్ల అయితే లీటర్ కు వంద నుండి వందయాభై యం.ల్ వరకు దండి కొట్టి ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నారు. అయితే ఈ మోసాలను పర్యవేక్షించేందుకే ఉన్న తూనికలు, కొలతల శాఖా అధికారులు ఎక్కడ నిద్ర పోతున్నారో అంతుచిక్కని ప్రశ్న. గతం లో ఈ శాఖ కు చెందిన ఆధికారులంటేనే వ్యాపారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేవి కానీ ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. ప్రస్తుతం మార్కెట్లల్లో జరిగే మోసాలపై సంభందిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా నిర్వీర్యమవడం మూలంగా వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిత్యవసరాల ధరలు చుక్కలనంటుతున్న ఈ రోజుల్లో వ్యాపారుల మోసాలకు బలై ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ శాఖ కు చెందిన అధికారులు వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు చేస్తు అక్కడ వాడే కొలత, తూనికల పరికరాలను పరిశీలించి ఎదైనా వ్యత్యసం ఉనట్లు నిర్ధారణ జరిగితే ఆ సంస్థకు బారి మొత్తంలో జరిమానా లేదా అవసరమైతే సీజ్ చేసే అధికారాలుంటాయి. కాని కాసుల కక్కుర్థికి బానిసలైన అధికారులు తమ విధులను, భాద్యతలను విస్మరించి వ్యాపారుల కనుసన్నల్లో పనిచేస్తు వారికి సహకరిస్తుండడం వల్ల ప్రజలు మోసపోవలసిందే అని, ఇక ప్రభుత్వానికి అసలు దీనికి సంభందించిన ఒక శాఖ ఉన్నట్లు గుర్తుందో లేదో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు కిరాణా షాప్స్, కూరగాయల మార్కెట్స్ ల్లో వ్యాపారుల అగడాలకు అడ్డులేకుండా పోయిందని తమ ఇష్టానుసారం తూకం వేసే మిషన్లకు సెట్టింగులు చేసి తీవ్రమైన మోసాలకు పాల్పడి ప్రజలని తీవ్ర నష్టం కల్పిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని ఇక వారం సంతల్లో(తై మార్కెట్) పరిస్థితి మరీ ధారుణంగా ఉందని సంతలో ఒక కిలో టమాటాలు కొని పక్క షాప్ తూకం వేసి చూడగా అరకిలోనే ఉన్నాయని ఈ విషయం పై సదరు వ్యాపారిని నిలదీస్తే దౌర్జన్యానికి ఒడిగడు తున్నారని ఈ విషయం పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదని ఓ మహిళ విచారం వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు రక్షణగా ఉండి, సంఘంలో దళారుల వల్ల జరుగుచున్న మోసాలను అరికట్డి ప్రజలకు అండగా ఉండాల్సిన ఆధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవడమే కాక దళారి వ్యవస్థకు లోంగిపోయి సమాజంనికి పట్టిన చీడలా మారడం దురదృష్టకరమని పలువురు అక్రోశం వెళ్ళగక్కారు. ఇదిఇలా ఉంటే పెట్రోల్ బంకుల్లో పరిస్థితి అత్యంత దారణంగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ.111 కాగా బంకుల్లో జరిగే మోసానికి వాహణదారులు తీవ్రంగా మోస పోతున్నా అధికారు చోద్యం చూస్తున్నారు. అసలు వీరు తమ విధులను ఎక్కడ నిర్వహిస్తున్నరని, ప్రతి రోజు ఎన్ని వ్యాపార కేంద్రాలు, ఎన్ని పెట్రోల్ బంకులను తనికి చేసి ఏన్ని కేసులు బుక్ చేసారో ప్రజలకు తెలపాలని పలువురు డిమాండ్ చేసారు. ఇలాంటి సమస్యలపై పాలకులు ఎందుకు శ్రద్ద చూపడం లేదని, వారికి ఈ మోసాలు కనిపించడం లేదా కాసుల కక్కుర్థితో కళ్ళు మూసుకు పోయయా అన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం స్పందించి తూనికల కొలతల అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం పై స్పందిస్తుందని ఆశిద్దాం.