అంతర్జాతీయ నగరంలో అన్ని సమస్యలే
“మూగపోయిన అధికారుల పోన్లు – తెరుచుకోని వెబ్ సైట్లు”
* ప్రజా సమస్యలు పట్టని జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు
* ఒక్క సమస్యను నమోదుకు రెండు మూడు రోజుల సమయం
* వెబ్ సైట్ల సమాచారం తో క్షేత్రస్థాయి లో పోంతన లేదు
*వెబ్ సైట్లలో ఎప్పటికప్పుడు అప్ డేట్ కానీ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు
* ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయని ల్యాండ్ లైన్ పోన్లు తో ప్రజల్లో గందరగోళం
* పరిస్థితి ఇలా ఉంటే విశ్వనగరంగా మారెదెప్పుడు.? సీఎం సార్
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) పేరుకు మాత్రం విశ్వనగరం కాని లోపల అన్ని సమస్యలే. ప్రభుత్వ శాఖల అధికారుల తీరు అత్యంత దారుణంగా మారింది. ప్రజాస్యలపై నిర్లక్ష్యం, దాటవేత దోరణితో ప్రజలకు ఇక్కట్లు అధిక మయ్యాయి.పెరుగుతున్న టెక్నాలజికి అనుగుణంగా ఏన్నో నూతన కార్యక్రమాల ను ప్రవేశ పెడుతున్నామని రాష్ట్ర మున్సిఫల్, ఐ టి శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటనలు ఎంత వరకు అమలవుచున్నాయో వెనక్కి మళ్ళీ చూసుకోవాలి. కొత్త వరవడికి శ్రీకారం చుడుతు అంతా అన్ లైన్ మయం చేయడం తో నేడు ప్రభుత్వ శాఖల పరిధిలోని కమీషనర్ల కార్యాలయాలో ప్రజా సమస్యలపై ఎంత వరకు స్పందిస్తున్నారో తెలుసుకోవాలి. అన్ లైన్ పాలనలో భాగంగా ప్రతి శాఖకు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తు ప్రజల సౌకర్యర్థం ఆధికారుల వివరాలు తో పాటు పోన్ నెంబర్లను పోందుపర్చి సమస్యలపై అధికారులతో నేరుగా మాట్లడవచ్చని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు ఆ వెబ్ సైట్ లో పొందుపర్చిన పోన్లు పనితీరును పట్టించుకోకపోడం పై శ్రద్ద చూపక పోవడం దురదృష్టకరం. ఒక పక్క వెబ్ సైట్ ఓపన్ కాక , మరోపక్క వెబ్ సైట్ లో ఉన్న నెంబర్ల పోన్లు పనిచేయక, నేరుగా ఆఫీసులకు వెళ్ళితే అధికారులు అందుబాటులో ఉండడం లేకపోవడం తో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం గ్రహించడం లేదు. ఇక కొన్ని చోట్ల కింది స్థాయి సిబ్బంది ఉన్నను సమస్యలపై వినతి పత్రాలను తీసుకోవడం లేదు. శాఖా పరమైన వెబ్ సైట్లలో ఉన్న అధికారుల వివరాలను పోందుపర్చడం లో పూర్తి నిర్లక్ష్యం ఒక అధికారి బదీలీ లేదా పదోన్నతిపై వెళ్ళినను వెబ్ సైట్లలో అప్ డేట్ చేయకపోవడం నిర్లక్ష్యం మూలంగా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారుతున్న పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిఇలా ఉంటే సమస్యలపై వచ్చే వినతులపై ఎంత వరకు చర్యలు తీసుకుంటున్నారో అంతుచిక్కని రహస్యం. చర్యలు తీసుకోకుండా అధికారులు లంచాల తో సరిపెడుతున్నారు అనడానికి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగమే ఒక నిదర్శనం. అన్ని వెబ్ సైట్లలో ఉన్నత అధికారుల సెల్ ఫోన్ నెంబర్లు ఉండవు కేవలం ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు ఉంటాయి, అవి అసలే పనిచేయవు వారితో ఎలా మాట్లాడాలి.? కిందిస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించారు ఎందుకంటే అవినీతి, అక్రమాలకు పాల్పడేది వారే కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి పోకుండా చూసుకుంటారు. ఇంత అవగాహన కూడా పాలకులకు లేదా.? వారి పరిపాలన గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ పరిస్థితి పై ఒక్కసారైనా ఆలోచించారా.? ఆత్మ విమర్శ చేసుకున్నారా.? దయచేసి చేసుకోండి మీ పరిపాలన పై మీకే సిగ్గేస్తుందని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే మరి అంతర్జాతీయ నగరం కావడానికి ఇంకెంత కాలం పడుతుందో మున్సిపల్, ఐటి శాఖా మంత్రి, ముఖ్యమంత్రి ప్రకటించాలి.