Vengal Rao

 

ఈ నగరానికి ఏమైంది.? గొట్టిముక్కల వెంగళ రావు

 

* ఇంకెంత కాలం ఈ వరద కష్టాలు..?

* చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడి

* వర్ష మొస్తే రహదారులన్ని జీవ నదులు

* చినుకు పడితే బస్సులు బందు పడవలు శురూ

* జీహెచ్ఎంసీకి పట్టని ప్రజల పాట్లు-సోయి లేని పాలకులు

* అక్రమ నిర్మాణాల ఫలితమే నగరానికి ఈ దుస్థితి

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) విచ్చలవిడి కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో హైదరాబాద్ నగర పరిస్థితి పెనం పై నుండి పోయ్యిలో పడిన చందంగా మారిందని, ఇప్పటికే నగరం చుట్టుపక్కల ఉన్న చెర్వులు,కుంటలు కబ్జాలకు గురై అక్రమ అనుమతులతో కాలనీలు గా మారాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు విమర్శించారు. ప్రతి వర్షాకాలం లో తమ ఇండ్లల్లోకి వరద పోటేతుతుండడం తో దిక్కులేని స్థితిలో వరద నీటిలోనే నెలల తరబడి బిక్కు బిక్కు మండు కాలం గడుపుతున్నా జిహెచ్ఎంసి అధికారులు మాత్రం  నిద్ర మత్తులో తూగుతుంటే పాలకులకు సోయిలేదని విమర్శించారు. హైదరాబాద్ నగర చెర్వులు కుంటలు కభ్జాలు కావడంతో నగరంలో చినుకు పడితేచాలు రోడ్లన్ని జీవ నదులుగా మారి ప్రజకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని విరుచుకుపడ్డారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిపోతున్నట్లు గానే నాయకుల హమీలు ఉపశమనం మాటలు  గాలిలా పోతున్నాయని, నాలాలు, కుంటలు తీర చెర్వులు పై నాయకుల కన్ను పడితేచాలు నిమిషాలలో కబ్జాకావలసిందే. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి పాలకుల అరాచకాలను దుమ్మెత్తి పోస్తు హైదరాబాద్ నగరానికి ఈ దుస్థితి పట్టించారని చించుకున్న మన ముఖ్యమంత్రి చేసేదేమిటని, గత సంవత్సరం వర్షాలవల్ల మునిగిన కాలనీల ప్రజల మాయమాటలు చెప్పి జిహెచ్ఎంసి ఎన్నికల్లో లబ్ది పోందే లక్ష్యం తో ఇంటింటికి పది వేలు పలహరం లా పంచి ఓట్లు దండుకునే  కుట్రకు తెరలేపారు. కాని దీని ద్వార సరైన లబ్ది దారులకు సహయం అందలేదని మద్య ధలారీలే బాగుపడ్డారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చినను ప్రభుత్వం పట్టించుకోలేదని వెంగళరావు విమర్శించారు. వరదల పై ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆలోచించకుండా వరదలో చిక్కుకున్న ప్రజలను ఏలా శాంతింప చేయాలనే దానిపైనే నాయకులు ముందుగానే స్క్రిప్ట్ రాసుకుంటున్నరని ద్వజమెత్తారు. ప్రతి సంవత్సరం కబ్జాలకు గురైన నాలా లని కుంటలను చెర్వులను పరిరక్షిస్తామని గొంతు చించుకునే నాయకులు ఎన్ని నాలా లను కబ్జాలనుండి కాపాడారని అసలు ఈ నాయకులు కబ్జాలు చేసిన నాలాలు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయని, వాటి జోలికి వెళ్ళితే తమ బండారం బట్టబయల వుతుందని పలువురు అమాత్యులు మౌనం దాల్చుతున్నారని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
తెంలంగాణా ఏర్పడిన వెంటనే హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరం చేస్తానని, రోడ్లని జీవ నదులు చేసి హైదరాబాద్ ప్రజలకు పడవ ప్రయాణం రుచి చూపించిన ఘనత మన పెద్ద దొరకేదక్కుతుందని విమశ్నించారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని మన ముఖ్యమంత్రి చేసే   అబద్దపు ప్రకటనలు, హమీలను ప్రజలు విశ్వసించడం లేదని ఉసేన్ సాగర్ నీటిని త్రాగేందకు వీలుగా శుద్ది చేస్తానని అప్పటి కమీషనర్ నేటి రాష్ట్ర ముఖ్యకార్యదర్శి అయిన సోమేష్ కుమార్ కు అప్పట్లోనే అర్డర్ వేయగా ఎందుకు ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్ట లేదని నీ అర్డర్ లో పస లేదా లేక అధికారులు నీ మాటను పెడ చెవ్విన పడుతున్నారా.? అని వెంగళరావు ప్రశ్నించారు. ఇక నగరం లో డ్రైనేజి వ్యవస్థ నిజాంకాలం లో వేసిందని అప్పటికి, ఇప్పటికి జనాభా ఎన్నో రేట్లు పెరిగిందని డ్రైనేజి వ్యవస్థను పూర్తిగా మార్చి కొత్తగా వేస్తానన్న నీ హమీ ఏమైందని దానికి ముహుర్తం దొరక లేదా.? లేక కమీషన్లు తక్కువనా అని అక్రోశం వెళ్ళకక్కారు. ప్రస్తుతం హైదరాబాద్ ముమ్మటికి విశ్వనగరమే. ఎందుకంటే నీ పాలనలో నగర రోడ్ల పై పడవలు తిరిగే స్థితికి దిగజార్చారని, ప్రపంచంలో ఒకే  రోడ్లపై బస్సులు, పడవలు తిరిగేది  ప్రపంచం లోనే మన హైదరాబాద్ నగర ఒకే ఒక్కటే. ప్రతి సంవత్సరం కొట్లాది డబ్బును పరిశుద్ద కార్యక్రమాల పేరున ఖర్చు చేస్తున్నను నగరం ఎందుకు ఈ దుస్థితిలో ఉందని జిహెచ్ఎంసి అధికారులు కాంట్రాక్టర్ లతో కుమ్మకై ప్రజా ధనాన్ని కమ్ముకుంటున్నా ప్రభుత్వ పర్యవేక్షణ ఏదని, విజిలెన్స్, ఏసీబీ అధికారులు నిద్రపోతున్నారా..? అన్నారు. పరిశుద్ద పనులలో అక్రమాలు, కబ్జాలన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల కనుసన్నలలో జరిగితే పర్యవేక్షణా, ఏసీబీ, విజిలెన్స్ విచారణ లాంటివి ఉండవని, అంతాదండుకోవడమే అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.