COv

కోవాక్సిన్ ధరలపై భారత్ బయోటెక్ షాకింగ్ ప్రకటన

 

🔹కేంద్రానికి ఝలక్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) కరోనా మహమ్మారి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్ బయోటెక్ తాము అందిస్తున్న కోవాక్సిన్ టీకా ధరలపై షాకింగ్ ప్రకటన చేసింది. కోవాక్సిన్ ధరలను తగ్గించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే కేంద్రానికి టీకా డోసుకు150 రూపాయలు చొప్పున సరఫరా చేస్తున్నామని పేర్కొన్న భారత్ బయోటెక్ ఇలా దీర్ఘకాలం తక్కువ ధరకు విక్రయించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ధర తమకు గిట్టుబాటు కాదని పేర్కొంది. అంతేకాదు టీకా ధరలను తగ్గించాలని వ్యాక్సిన్ కంపెనీలతో మరోసారి చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించిన మరుసటి రోజే భారత్ బయోటెక్ ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. తక్కువ సేకరణ వాల్యూమ్‌లు, అధిక పంపిణీ ఖర్చులు మరియు రిటైల్ మార్జిన్‌ల నుండి ప్రాథమిక వ్యాపార కారణాలు కోవాక్సిన్ అధిక ధరలకు కారణమని భారత్ బయోటెక్ వెల్లడించింది.

భారతదేశంలో ప్రైవేట్ రంగానికి అందుబాటులో ఉన్న ఇతర కోవిడ్-19 వ్యాక్సిన్లతో పోల్చినప్పుడు ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొంటూ ధరను సమర్థించింది.కోవాక్సిన్ భారత ప్రభుత్వానికి రూ 150 చొప్పున మోతాదుకు సరఫరా చేసే ధర, పోటీ లేని ధర మరియు దీర్ఘకాలంలో ఇలా ఇవ్వలేమని పేర్కొంది. అందువల్ల ఖర్చులలో కొంత భాగాన్ని పూడ్చడానికి ప్రైవేట్ మార్కెట్లలో అధిక ధర అవసరం అని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ మార్కెట్లో కోవాక్సిన్ ధర మోతాదుకు 1200 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ తాము ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ సగటు ధర మోతాదుకు 250 రూపాయల కంటే ఎక్కువ అవుతుందని వెల్లడించింది. కనుక కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసుల ధర తమకు గిట్టుబాటు కావడం లేదని వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమైన డెల్టా వేరియంట్ నుండి బీటా వేరియంట్ వరకు కోవాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని భారత్ బయోటెక్ పేర్కొంది. భారత్ బయోటెక్ ఉత్పత్తి, అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ మరియు కోవాక్సిన్ కోసం ఉత్పాదక సదుపాయాల ఏర్పాటు కోసం తన సొంత వనరుల నుండి ఇప్పటివరకు రూ 500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. కాబట్టి ప్రభుత్వం ధరల విషయంలో ఇబ్బంది పెడితే వ్యాపారం చెయ్యలేమని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలకు 10 శాతంలోపే టీకాలను విక్రయిస్తున్నామని పేర్కొంది. అంతేకాదు కోవాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో వెల్లడిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది.