దళిత బంధుపై పిల్ కాదు..పిటిషన్ వేయండి…
– హైకోర్టు ధర్మాసనం
దళిత బంధు పథకం పై విచారణకు హైకోర్టు నో చెప్పింది.. హుజూరాబాద్‌లో పథకం అమలును ఆపాలని కొంతమంది వేసిన పిల్‌ను కొట్టివేసింది.. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో జనవాహిని పార్టీ, జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీలు సంయుక్తంగా పిల్ దాఖలు చేశాయి. పైలట్ ప్రాజెక్టులో 1500 కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు ఖర్చు చేయడం రాజ్యాంగంలోని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంట్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఎన్నికల సంఘం, మరియు అధికార టీఆర్ఎస్, కాంగ్రేస్, బీజేపీలను కూడా ప్రతివాదులుగా పేర్కోన్నారు.. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం ఎన్నికల కోసమే ఈ పథకం అంటూ చేసిన వ్యాఖ్యలతో ఆయన పేరును కూడా ప్రతివాదిగా పేర్కొన్నారు.
కాగా ఈ పథకం హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేపట్టారని… అందుకే ఈ పథకాన్ని సుమోటోగా స్వీకరించాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టును కోరాడు.. అయితే న్యాయవాది పిల్‌ను ను విచారించిన సీజే హిమాకోహ్లి, విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశంపై పిటిషన్ వేస్తే అప్పుడు పరిశీలిస్తామని ధర్మాసనం సూచించింది. కాగా హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పత్రిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే… పక్కగా ఎన్నికల లబ్ధి కోసమే పథకం తీసుకువస్తున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని సీఎం కేసిఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటనతో ఇందుకు సంబంధించిన కార్యచరణ కూడా మొదలైంది. ఈ స్కీంను పైలట్ ప్రాజెక్ట్‌గా ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనేపథ్యంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇక ఇందుకోసం నేడు 500 కోట్ల రూపాయల నిధులను కూడా సర్కారు విడుదల చేసింది. మరోవైపు ఈ పథకంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ స్కీం ద్వారా ఓటర్లను మభ్యపెట్టేందుకు తీసుకువస్తున్నారని బహిరంగా లేఖ రాసింది. అయితే పిల్ గా కాకుండా పిటిషన్ ద్వారా వెళితే స్వికారిస్తానని హై కోర్టు చేప్పడంతో మరోసారి పిటిషన్ ద్వారా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.