వన్ ఎర్త్..వన్ హెల్త్ కాన్సెప్ట్ తో ప్రధాని
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) ప్రతిష్ఠాత్మకమైన జీ7 వర్చువల్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఒకే విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఏర్పడిందని అన్నారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్.. కాన్సెప్ట్‌తో అన్ని దేశాలు ఈ సంక్షోభాన్ని అధిగమించాలని సూచించారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశం కల్పించాలని కోరారు. జీ7 వర్చువల్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రసంగించారు. బ్రిటన్‌లోని కాబిస్ బేలో ఇది ప్రారంభమైంది. ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిస్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్-హెల్త్ అనే అంశంపై ప్రసంగించారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారికి దిశానిర్దేశం చేశారు.
భవిష్యత్తులో ఎలాంటి వైరస్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. దాన్ని సమష్టిగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను తాము సమర్థవంతంగా వినియోగించుకోగలిగామని అన్నారు. వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్‌లో వాటి పాత్ర కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. మేథో సంపత్తి హక్కుల వినియోగంపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి జీ7 సభ్య దేశాలు అంగీకించాలని ప్రధాని కోరారు. ప్రత్యేకించి కోవిడ్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై ట్రిప్స్‌ను తొలగించడానికి తాము మద్దతు ఇస్తున్నామని అన్నారు. మేధో సంపత్తి హక్కులపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి ఇంతకంటే మంచి సమయం రాబోదని ప్రధాన వ్యాఖ్యానించారు.కరోనా సంక్షోభ సమయంలో జీ7 సహా అనేక దేశాలు భారత్‌కు ఆపన్నహస్తం అందించాయని గుర్తు చేశారు. చేసిన సహాయాన్ని మరిచిపోయే గుణం భారతీయుల్లో లేదని పేర్కొన్నారు. అనేక దేశాలు భారత్‌ను అన్ని విధాలుగా ఆదుకున్నాయని పేర్కొన్నారు. అన్ని దేశాలు సమష్ఠిగా ఉన్నాయని, ఐక్యంగా మసలుకుంటున్నాయనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినట్టయిందని నరేంద్ర మోదీ చెప్పారు. కష్ట సమయంలో పరస్పరం ఆదుకోవడానికి వెనుకాడకూడదని సూచించారు. కరోనా వైరస్ విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు.