KCR

 

సెక్రటేరియట్‌ను విజిట్ చేసిన సీఎం కేసిఆర్..

 

🔹పనులపై రివ్యూ

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) నిర్మాణంలో తెలంగాణ సెక్రటేరియట్ పనులను మొదటిసారి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు..ఆయన స్యయంగా అధికారులతో కలిసి వచ్చి సేక్రటేరియట్ ప్రాంగణాన్ని కలియదిరిగారు. సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో కలిసి పనుల పురోగతిపై ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ తోపాటు ఇతర అధికారులు ,ఇంజనీర్లు సేక్రటేరియట్ ప్రాంగణంలోనే సీఎం సమావేశమయ్యారు. కాగా సెక్రటేరియట్ నిర్మాణంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.కాగా 5 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవన నిర్మాణం జరుగుతోంది.మొత్తం 6 అంతస్తుల్లో… 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సీఎంతోపాటు.. మంత్రుల ఆఫిసులు ఇతర మంత్రుల పేషిలు ఉన్నతాధికారుల ఆఫీసులను అనుసంధానం చేసి నిర్మిస్తున్నారు…ముఖ్యంగా ఒక శాఖకు సంబంధించిన మొత్తం వ్యవస్థ ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అతిపెద్ద సమావేశ మందిరాలులతోపాటు అన్ని హంగులతో..పలు రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా అత్యాధునిక హంగులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

ఈ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో బ్యాంకులు, పోస్టాఫిసులు శిశు సంరక్షణా కేంద్రం, ఆసుపత్రి, క్యాంటీన్లతో పాటు వేర్వేరుగా మూడు ప్రార్థనా మందిరాల్ని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఉత్తరం వైపు, ఉద్యోగులకు తూర్పు దిశలో సందర్శకులకు దక్షిణం వైపు ప్రత్యేకంగా ప్రవేశద్వారాలు ఏర్పాటు చేస్తారు. పర్యావరణహితం..పూర్తి పర్యావరణహితంగా, గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరుగుతోంది. కాగా 2019లో జూన్ లో నూతన సచివాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు..అయితే సెక్రటేరియట్ కూల్చివేతపై కోర్టులో పిటిషన్లు పడడంతో హైకోర్టు కొద్ది రోజుల పాటు స్టే విధించింది..అయితే కూల్చివేతలపై స్టే తొలగిపోవడంతో గత కొద్ది రోజుల క్రితమే కూల్చివేత పనులు ప్రారంభించి పూర్తి చేశారు..అనంతరం నూతన సేక్రటేరియెట్ నిర్మాణం కొనసాగుతోంది..కాగ ఈ నిర్మాణాన్ని 2022 ఆగస్టు వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసిఆర్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.