నిప్పు లేనిదే పొగ రాదు
‘డ్రగ్స్’ ఇష్యూపై రేవంత్
స్కూళ్లలో గంజాయి అమ్ముతున్నారు
ఇంత జుగుప్సాకరం ప్రభుత్వానికి కనిపించట్లేదా
అకున్ సబర్వాల్‌ను విచారణ నుంచి ఎందుకు తప్పించారు?
ప్రభుత్వం కేంద్ర సంస్థలకు ఆ సమాచారం ఇవ్వనంటోంది
కేంద్ర సంస్థలతో కలిసి సిట్ వేస్తే అన్నీ బయటపడుతాయి
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) డ్రగ్స్ వినియోగంపై వైట్ ఛాలెంజ్ విసిరితే మంత్రి కేటీఆర్ ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గన్‌పార్క్ వద్దకు తనకన్నా అరగంట ముందే వచ్చి సవాల్ స్వీకరిస్తాడనుకుంటే… ఉదయం నుంచి తనపై తిట్ల దండకం అందుకున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కూడా తనతో వస్తే ఢిల్లీ ఎయిమ్స్‌లో కలిసి టెస్టులు చేయించుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రాహుల్ కూడా అందుకు సిద్ధపడితే… అప్పుడు ఇవాంకా ట్రంప్ రావాలంటేడేమోనని ఎద్దేవా చేశారు.కేటీఆర్‌ను తాను సూటిగా ఒకటే అడుగుతున్నానని… వైట్ ఛాలెంజ్‌తో రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉందామని మరోసారి పిలుపునిచ్చారు. గన్‌పార్క్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాదుతు మంత్రి కేటీఆర్ యువకులకు ఆదర్శంగా ఉన్నాడని పదేపదే చెప్పుకుంటారు… తెలంగాణలో దాదాపుగా స్కూళ్లు,కాలేజీల్లో 40లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.హైదరాబాద్‌లో ప్రముఖుల పిల్లలు చదువుకునే స్కూళ్లతో పాటు మధ్యతరగతి పిల్లలు చదువుకునే పాఠశాల్లో డ్రగ్స్,గంజాయి విక్రయిస్తున్నారు.రాత్రిపూట జరిగే పార్టీలకు ప్రభుత్వమే అనుమతి ఇస్తోంది.డ్రగ్స్ వినియోగంపై ఎక్సైజ్ శాఖ నివేదికలు ప్రభుత్వానికి అందుతున్నాయి.పాఠశాల్లలో ఇంత వేగంగా డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తుంటే లోతైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీపై లేదా.దీనికి సమాధానం చెప్పకపోగా నాపై ఎదురుదాడి చేస్తారా. నన్ను థర్డ్ రేట్ క్రిమినల్… చర్లపల్లి బ్యాచ్ అని విమర్శలు చేస్తున్నారు. ఎవరు నేరగాళ్లు… ఎవరేంటో చర్చ చేస్తే డ్రగ్స్ అంశం పక్కకు పోతుంది. తాతలు,తండ్రులపై ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘నేను కేటీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. నేనేమీ ఆయన ఆస్తులు,ఫాంహౌస్‌లు అడగలేదు.తెలంగాణ యువకులకు రాష్ట్ర ప్రజాప్రతినిధులుగా ఆదర్శంగా ఉందామని చెబుతున్నా.ఇందుకోసం మన రక్తం,వెంట్రుకల నమూనాలను డ్రగ్స్ పరీక్షల కోసం ఇద్దామంటున్నా. ఇటీవలే మీడియాతో చిట్‌చాట్‌లో… డ్రగ్స్‌తో నాకే సంబంధం… నా రక్తమిస్తా… నా వెంట్రుకలిస్తా… నా నిజాయితీని నిరూపించుకుంటానని కేటీఆరే అన్నారు. కేటీఆర్ ఇంత ఆదర్శంగా ఉన్నప్పుడు.. నేను వెనక్కి తగ్గితే యువకులకు అనుమానం వస్తది కాబట్టి… నేను వైట్ ఛాలెంజ్ విసిరాను. గన్‌పార్క్ వద్దకు వస్తే ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని ప్రజలకు ఆదర్శంగా ఉందామని అన్నాను.కేటీఆర్‌తో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి స్పోర్టివ్‌గా ఛాలెంజ్ విసిరాను.కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రాగా కేటీఆర్ ఎందుకు రాలేదో తెలంగాణ యువతే ఆలోచించుకోవాలి.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హీరో రానా,హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ కేసు విచారణకు ఈడీ అధికారులు పిలిచారు.వాళ్లు నేరాలకు పాల్పడ్డారా లేదా అనేది మాకు తెలియదు. అయితే పొగ లేనిదే నిప్పు వస్తదా.వాళ్లను విచారణకు పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు.కేటీఆర్‌కు బాధ్యత లేదా. మాట్లాడితే కేటీఆర్‌ది తనకంటే ఎక్కువ స్థాయి అంటున్నారు. నేను కేటీఆర్ కంటే ముందే ఎమ్మెల్సీని.2009లో నేను ఏడున్నరవేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిస్తే… కేటీఆర్ 100 ఓట్లతో అత్తెసరు మార్కులతో గెలిచాడు.ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని.రాజకీయంగా నువ్వు నా ముందు వెంట్రుకతో సమానం.కానీ నేనా మాట అనదలుచుకోలేదు.’ అని కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి ‘గత 65ఏళ్ల టీడీపీ,కాంగ్రెస్ పాలనలో కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆరు పబ్బులకే అనుమతి ఉండేది.కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 పబ్బులకు అనుమతినిచ్చారు.శనివారం,ఆదివారం రాత్రి 10గం. నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు కొండాపూర్,మాదాపూర్,కావూరి హిల్స్,బంజారాహిల్స్ ఏరియాల్లో పబ్బులు నడుస్తున్నాయి. సీఎం గారు ఒకసారి రాత్రి మొత్తం రహస్యంగా రౌండ్స్ కొట్టండి. అసలు ఏ ప్రపంచంలో మనం ఉన్నామో తెలుస్తుంది.12,14ఏళ్ల ఆడపిల్లల నుంచి మొదలుపెడితే చాలామంది స్పృహలో లేకుండా తాగి,ఊగి రోడ్ల మీద దొర్లుతుంటే…. 7లక్షల సీసీ కెమెరాలు పెట్టామని చెప్పుకుంటున్నవారికి… ఇంత జుగుప్సాకరమైన అసాంఘీక కార్యక్రమాలు కనిపించట్లేదా.మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పిల్లలు కూడా పబ్బులు నడుపుతున్నారు.రాత్రి 11గంటలకు బంద్ కావాల్సిన పబ్బులు తెల్లవారుజాము వరకు నిర్వహిస్తుంటే చర్యలేవి.తెలంగాణను తాగుబోతుల అడ్డా,మత్తుకు బానిసలుగా మార్చి ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనుకుంటున్నారా.’ అని రేవంత్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ‘తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే హైదరాబాద్ నగరంలో గుడుంబా,గంజాయి,డ్రగ్స్,విచ్
‘ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు… ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర పరిధిలో మాత్రమే విచారణ చేయగలదు.గంజాయి పండించేవాళ్లను,విక్రయించేవాళ్