Bandi and tarun chugh

 

కేసీఆర్ ను సాగనంపేందుకే నిర్మల్ సభ – తరుణ్ ఛుగ్

 

🔹1948లో పటేల్.. ఇప్పుడు అమిత్ షా..
🔹బోర్ కొడితేనే ప్రగతిభవన్‌కు కేసీఆర్
🔹జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ సర్కారు
🔹హుజూరాబాద్ ప్రచారానికీ అమిత్ షా..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణలో త్వరలో రాజకీయ మార్పు తథ్యమని అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మహా సంగ్రామ పాదయాత్రతోనే అది మొదలైందన్నారు. టీఆర్ఎస్ సర్కారు అంతానికి సెప్టెంబర్ 17న జరిగే బీజేపీ సభలో సమర శంఖం పూరిస్తామన్నారు. 17న జరిగే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తరుణ్ ఛుగ్ తెలిపారు.అమిత్ షా పర్యటనకు సంబంధించి నిర్వహించిన సన్నాహాక సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకే సెప్టెంబర్ 17న ముహూర్తం ఫిక్స్ అయ్యిందన్నారు. ఇందులో భాగంగా అమిత్ షా.. నిర్మల్ బహిరంగ సభ వేదికగా శమరశంఖారావం పూరిస్తారని తెలిపారు. అమిత్ సా పర్యటన పురష్కరించుకుని స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్‌లో సన్నాహక సమావేశం జరిగింది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు పుట్టినగడ్డ తెలంగాణ అని తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఆనాటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు వచ్చి.. నిజాం పాలన నుంచి విముక్తి కలిగిస్తే.. 2021 సెప్టెంబర్ 17న ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా.. నేటి టీఆర్ఎస్ సర్కారు నుంచి విముక్తికి సమర శంఖం పూరిస్తారని ఛుగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మార్పు తథ్యమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను సాగనంపేందుకే నిర్మల్ సభ వేదిక కానుందన్నారు. అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని తరుణ్ ఛుగ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. అంతకుముందు అమిత్ షా బహిరం గ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెల్లడించారు తరుణ్ ఛుగ్.

మరోవైపు బండి సంజయ్ కూడా టీఆర్ఎస్ సర్కారుపై తనపాదయాత్రలో నిప్పులు చెరిగారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ షెడ్యూల్ కేవలం ప్రగతి భవన్ టు ఫాంహౌజ్.. ఫాం హౌస్‌ టు ప్రగతిభవన్‌కే పరిమితమైందని విమర్శించారు. కేటీఆర్తో కొట్లాడి.. ఇంట్ల లొల్లి అయితే ఫాంహౌస్‌కు పోవడం.. అక్కడ బోర్ కొడితే మళ్లీ ప్రగతి భవన్ కు రావడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. ప్రధాని మోడీ 18 గంటలు పని చేస్తుంటే.. సీఎం కేసీఆర్ 4 గంటలు పనిచేసి 18 గంటలు పడుకుంటారని ఎద్దేవా చేశారు. సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 15వ రోజైన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో కొనసాగింది. యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గియా, ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్, బాబుమోహన్, ఏనుగు రవీందర్ పాల్గొన్నారు. జోగిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రజలు ఉద్యమం చేసి టీఆర్ఎస్కు అధికారం కట్టబెడితే కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచి బందీగా ఉన్న తెలంగాణ తల్లిని విముక్తి చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, చేనేత.. అన్ని కుల వృత్తులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని సంజయ్ మండిపడ్డారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైంకు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇన్స్టాల్మెంట్పద్ధతిలో జీతాలిచ్చే పరిస్థితికి రాష్ట్ర ఖజానాను తీసుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని బండి సంజయ్ తేల్చి చెప్పారు. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చి గోల్కొండపై కాషాయ జెండా ఎగరేస్తుందన్నారు. రానున్న హుజూరాబాద్ ఉప ఉన్నికలో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదు. అంబేద్కర్ను అవమానించిన టీఆర్ఎస్, కాంగ్రెస్లకు అక్కడ మనుగడ లేదన్నారు. అంబేద్కర్‌ వర్ధంతి, జయంతిల్లో పాల్గొనక పోవడం చూస్తేనే దళితులపై టీఆర్ఎస్కు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమైతుందని బండి సంజయ్ విమర్శించారు.

కాగా, హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు చెబుతామన్నారు. హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉంది.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం ఢిల్లీ వెళ్లాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ అమిత్ షా సభకి మూడు లక్షల మంది వచ్చేలా శ్రేణులు పని చేయాలని పిలునిచ్చారు. కేంద్ర నాయకత్వం పూర్తి సహాయం అందిస్తుంది. హుజురాబాద్ గెలుపు పార్టీకి అవసరం. ఎంఐఎం గుండాలు బైంసాలో విధ్యంసం సృష్టించారు. ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తుందని సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడం లేదు. 2023 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.