Etala Rajender

 

కేసీఆర్‌పై ఈటల రాజేందర్ నిప్పులు

 

🔹నా పేరుతో దొంగలేఖలు
🔹ఆ రోజు టీఆర్ఎస్ కు దిమ్మతిరగాలి
🔹కేసీఆర్ చిల్లర పనులకూ వెనకాడరన్న ఈటల

 

హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవలేదనే కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బేతిగల్‌లో పలువురు నేతలు బీజేపీలు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. ‘ఇంటింటికీ దళిత బంధు వద్దని నేను లెటర్రాసినట్లు టీఆర్ఎస్సోళ్లు దొంగ లెటర్ పుట్టిచ్చిన్రు. ఆ దొంగ లెటర్ మీద మళ్లీ వాళ్లే ధర్నాలు చేయిస్తున్నరు. కుట్రలు చేస్తున్నరు. నా వల్లే హుజూరాబాద్కు దళితబంధు వచ్చిందని సంబురపడుతున్నా. ఎన్నికల కంటే ముందే అన్ని కుటుంబాలకు దళిత బంధు ఇయ్యాల్నని డిమాండ్చేసిన. అసొంటి నేను దళితబంధు వద్దని ఈసీకి ఎందుకు లెటర్ రాస్త? ఎట్ల రాస్త?’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. నాకు సమర్థత, దమ్ము ఉన్నందనే పదవులు ఇచ్చారు. కేసీఆర్ ఇస్తున్న డబ్బులన్నీ మనవే.. తీసుకోండి. నేను రాజీనామా చేస్తే చాలా వచ్చాయి. గెలిస్తే ఎన్ని వస్తాయో ప్రజలంతా ఆలోచించాలి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతకుముందు సిరిసపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈటల మాట్లాడారు. తాను పేదల గొంతుకనని, గెలిపించాలని ప్రజలను కోరారు. అక్టోబర్ 30న కుప్పలు కుప్పలుగా కమలం గుర్తుపై ఓట్లు పడతాయని, నవంబర్ 2న ఓట్ల లెక్కింపుతో టీఆర్ఎస్ నేతల దిమ్మదిరుగుతుందని అన్నారు. అక్టోబర్ 30న జరగనున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలవడం ఖాయమని ఈటల వ్యాఖ్యానించారు. దళితబంధు లాంటి ఎన్ని స్కీములిచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, దావత్ లు ఇచ్చినా అవన్నీ ఈటల వల్లనే వచ్చాయని ప్రజలు అంటున్నారని, దీంతో ఏం చెయ్యాలో అర్థంకాని టీఆర్ఎస్ లీడర్లు చిల్లర పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సుమారు 100 మంది బుధవారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. జమ్మికుంట పట్టణంలోని ఈటల నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అనే వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టడం , సారా పంచడం మాత్రమే కాకుండా బట్టకాల్చి మీద వేసి అభాసుపాలు చేస్తారని, చిల్లర పనులు కూడా చేస్తరని మండిపడ్డారు. తనకు 75 నుంచి -80 శాతం ప్రజలు మద్దతు ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ అహంకారానికి వ్యతిరేకంగా, ఆత్మగౌరవానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నాయకురాలు నిరూపరాణి, పలు ఊర్ల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మరోవైపు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగే శోభ కూడా కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నాయకులను ఇంకా కొనలేక.. వారి కోసం ఖర్చు పెట్టలేక కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలా చేశారన్న శోభ.. అందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలిసినవాడు కేసీఆర్ అని ఆమె విమర్శించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ చేస్తున్న ‘ప్రజా దీవెన యాత్ర’ హుజూరాబాద్ మండలం సిరసపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ యాత్రలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. సిర్సపల్లి గ్రామస్తులు ఈటల రాజేందర్ కు బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాట్లాడారు. కుటుంబపాలనతో విసుగు చెందిన ప్రజలు 2023లో కేసీఆర్‎కు బుద్ది చెప్పాలని చూస్తున్నారు. దళితులకు ఇస్తానన్న పదిలక్షలు ఇవ్వకపోతే.. నీకు చావు డప్పు కొట్టి సమాధి చేస్తారు. జాగ్రత్త కేసీఆర్.. మీరు మాట తప్పితే.. అసెంబ్లీలో మిమ్మల్ని ఈటల నిలదీస్తారు. బీసీ బంధు కోసం కూడా అడుగుతారు. ఈటలను అసెంబ్లీకి పంపిస్తేనే కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి వస్తుంది. ఈటలను ఓడించాలని మీరు నాయకులను కొన్నారు కావచ్చు.. కానీ ప్రజలను కొనలేరు. కేసీఆర్ జేజెమ్మ వల్ల కూడా అది సాధ్యం కాదు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా బీజేపీకే ఓటువేయాలని చెబుతున్నారు. రేపటి నుంచి మీ దగ్గర చీరలు పంచుతారట.. మామూలు చీరలు తీసుకోకండి. ఎమ్మెల్సీ కవిత కట్టుకునే క్వాలిటీ చీరలు కావాలని కోరండి. లక్ష మెజార్టీ తగ్గకుండా ఈటల రాజేందర్‎ను గెలిపించాలి. ఈ పోటీ గెల్లు శ్రీనివాస్‎తో కాదు.. కేసీఆర్‎తో మాత్రమే. రూ. 10 లక్షల రూపాయలతో పాటు.. మూడెకరల భూమి సంగతేందని హరీశ్ రావును పిలిచి అడగండి. చింతమడకలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఏదని నిలదీయాలని బొడిగే శోభ హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ ఖరారు కావడంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. మాజీ మంత్రి కొండా సురేఖను పోటీ చేయించాల్సిన రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.