Shivalayam Lo Niluvu Dopidi
శివాలయాలలో నిలువు దోపిడి
-కళ్యాణోత్సవం అభిషేకం డబ్బులు ఎవరి జేబులోకి..
– పండుగ సందర్ణంగా టికెట్లను అందుబాటులో ఉంచని ఈవో రమాదేవి..
– గూగుల్ పే, ఫోన్ పే తో డబ్బులు ఎవరికి కొట్టించుకున్నారో..
-పండుగలకు ప్రణాళికలు లేని ఈవో పాలన అవస్థలలో భక్తులు..
-పండుగ సందర్భంగా భక్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
నాచారం (ప్రశ్న న్యూస్) శివరాత్రి పండుగ సందర్భంగా కొన్ని ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాలలో ఈవో ల కనుసైగల్లో దోపిడి రాజ్యం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్ లో ఉన్న శ్రీ మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఈవో రమాదేవి నిర్లక్ష్యంతో ఎండోమెంట్ కు రావలసిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అర్థం కాని పరిస్థితి శివరాత్రి పండుగ సందర్భంగా శివ కల్యాణోత్సవం, అభిషేకం, అర్చనకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే కాకుండా భక్తుల నుండి డబ్బులు వసూలు చేశారని కానీ ఎవరి గూగుల్ పే ఫోన్ పే కు వేసుకున్నారో ఈఓ రమాదేవి కే తెలియాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవాలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని భక్తుల కష్టాలు ఎక్కువైపోయానని భక్తులకు పండుగ సందర్భంగా ఏర్పాటు చేయవలసిన సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించారని సరైన సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Check to China
సమస్యలపై ఆలయ దాతలు ఈవోని ప్రశ్నించగా సమాధానం సమాధానం చెప్పకపోగా భక్తులకు సమాధానం చెప్పే అవసరం లేదని దాతలు దేవాలయాలకు ఇవ్వాలని ఎవరు అడగడం లేదని ఈవో అనడంపై దాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాతల పుణ్యాల వల్లనే ఈరోజు చాలా దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని అందులో భాగంగా నాచారంలోని ప్రస్తుత ఇంచార్జ్ రమాదేవి విధులు నిర్వహిస్తున్న దేవాలయానికి భక్తుల వలనే ఇంత అభివృద్ధి చెందిందని కానీ ఈవో దాతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి ఎండోమెంట్ ఎంత నిధులు కేటాయించింది భక్తులు హుండీల ద్వారా అభిషేకాలు కళ్యాణోత్సవం ద్వారా వచ్చిన దాదాపు రెండు లక్షల పైచిలుకే ఉంటుందని భక్తులు పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా ఎండోమెంట్ ఇచ్చిన నిధులను ఈవో భక్తులకు తెలియజేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని దేవాలయాల్లో మాత్రం ఈవోలు దేవుళ్ళ డబ్బులను కూడా స్వాహా చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. భక్తులకు తాగునీరు సౌకర్యం లేక అపరిశుభ్ర వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయని చివరికి సిబ్బంది కూడా ఇబ్బంది పడ్డారని ముందుగానే అవగాహన లేని ఈవో రమాదేవి వల్ల ఇటు భక్తులు అటు ఆలయ సిబ్బంది చాలా ఇబ్బందులు పడ్డారని ఇలాంటి ఈవోల నిర్లక్ష్యం వల్ల భక్తులకు సంకటాలు తప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.