Harish Rao

 

కుసంస్కారం వర్సెస్ సంస్కారం

 

🔹ఎమ్మెల్యే.. మంత్రిగా అవకాశం ఇస్తే ఇలా అగౌరవిస్తారా..
🔹ఈటల రాజేందర్‌పై హరీశ్ రావు విసుర్లు
🔹హుజురాబాద్ బై పోల్ లో మాటల మంటలు
🔹ఈ నేపథ్యం లో పథకం కంటిన్యూ అవుతుందా..?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ బై పోల్ సమీపిస్తోంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్.. లేదంటే ఆయన భార్య జమున బరిలోకి దిగుతారు. టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. కొండా సురేఖ పేరు దాదాపు కన్ఫామ్ అవనుంది. అయితే టీఆర్ఎస్- బీజేపీ మధ్య మాటల యుద్దం పీక్‌కి చేరింది. ఇటీవల హరీశ్ రావు, కేసీఆర్ లక్ష్యంగా ఈటల రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి హరీశ్ రావు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఓ సభలో ఈటల రాజేంధర్ ఆగ్రహాంతో ఊగిపోయారు. తనపై హరీశ్ రావు, కేసీఆర్ పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆ సందర్భంలో ఆరేయ్ అని అగౌరవంగా మాట్లాడారు. దీనికి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్‌కు రాజకీయంగా జన్మనిచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. అలాంటి పార్టీ, అధినేత.. మంత్రులను అగౌరవంగా మాట్లాడటం సరికాదన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారని వివరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. నరం లేని నాలుక ఉందని నోరు పారేసుకోవడం తగదన్నారు. తీరు మార్చుకోవాలని సూచించారు.

తల్లి లాంటి పార్టీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది కదా అని హరీశ్ రావు అడిగారు. రెండు సార్లు మంత్రిని చేయలేదా అని నిలదీశారు. పదవీ ఇచ్చి.. గౌరవం ఇస్తే ఇలా కామెంట్ చేస్తారా అని హరీశ్ ఫైరయ్యారు. తాము మాత్రం సంస్కారాన్ని తగ్గించుకోలేదని చెప్పారు. రాజేందర్ గారూ అని పిలుస్తాం అని చెప్పారు. తన ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే ఈటల రాజేందర్ వామపక్ష భావజాలాన్ని విడిచారని వివరించారు. లెప్టింజ వదలి రైటిజం నేర్చుకున్నారని వివరించారు. బీజేపీలో చేరగానే భాష కూడా మారిందని పేర్కొన్నారు. తాము మాత్రం ఉన్న విషయాలే చెబుతామని.. భాష, భావం మార్చమని తేల్చిచెప్పారు. హుజురాబాద్ బై పోల్ వేళ సీరియస్ నెస్ ఎక్కువ అవుతుంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే షెడ్యూల్ రాలేదు.. కానీ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో విజయం ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య కాగా.. టీఆర్ఎస్ కూడా ప్రతిష్టత్మకంగానే తీసుకుంది. కాంగ్రెస్ కూడా అదేవిధంగా పోటీ చేయనుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుంది. బై పోల్ ఏమో కానీ.. నియోజకవర్గంలో వందల కోట్లను అభ్యర్థులు గుమ్మరించే ఛాన్స్ ఉంది. మద్యం ఏరులై పారగా.. నగదు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు.

మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనేది ఇక్కడ ప్రశ్న.. రాష్ట్రంలో గల నిరుపేద దళితులు.. దళిత బంధు పథకం కోసం ఆప్లై చేసుకోవాలా… నిజంగానే నగదు ఇస్తారా అనే సందేహాం ప్రతీ ఒక్కరిలో మెదలుతుంది. కానీ దీనికి సంబంధించి సమాధానం కావాలంటే కాలామే చెప్పాలి. ఎందుకంటే బై పోల్ జరిగే వరకు ఏ విషయంపై క్లారిటీ ఉండదు. ఎన్నిక, ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. ఎందుకంటే పాలకులు బడుగు, బలహీనవర్గాలను పట్టించుకోవడం అరుదుగానే ఉంటుంది. మరీ దళిత బంధు విషయంలో అలా జరుగుతుందా.. లేదో చూడాలి.