జల జగడంపై కేంద్రం వివరణ
🔹ఎంతో చర్చించాకే గెజిట్ విడుదల..
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న తరువాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల బోర్డుల పరిధి, నిర్వహణపై తాము విడుదల చేసిన గెజిట్‌పై కేంద్ర జలశక్తి అధికారులు వివరణ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుందని తెలిపారు. 2016లో తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశమైందని… ఆ సమయంలో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందని అన్నారు. నోటిఫికేషన్ ప్రకారం బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాల్సి ఉంటుందని… నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోగా రూ.200 కోట్లు చొప్పున డిపాజిట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. బోర్డుల నిర్వహణ, నిధులు, వనరుల కొరత రాకూడదని కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆమోదం పొందిన ప్రాజెక్టులు.. పొందని ప్రాజెక్టుల వివరాలు ఇందులో పేర్కొన్నామని అన్నారు. షెడ్యూల్-3లో ఇప్పుడు ఉన్నట్లే రాష్ట్రాల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. 2014 నుంచి బోర్డుల పరిధిపై కసరత్తు చేస్తున్నామని.. సీడబ్ల్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గెజిట్‌లో పేర్కొన్న ప్రతి పదం, ప్రతి వాక్యం రాశాం ఎంతో ఆలోచించిన తరువాతే ప్రస్తావించామని అన్నారు. రాష్ట్ర విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
Related posts:
భూవివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే, తహసీల్దార్
గాలిని కూడా అమ్ముతారో ఏమో..
తెలంగాణలో పాదయాత్రలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఇంటి దొంగలకు రేవంత్ డెడ్ లైన్
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించిన ప్రధాని మోదీ
మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు
హుజురాబాద్‌లో... ఈటల బీటలు వారుతున్నాయ్ - గంగుల కమలాకర్
అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ