Telangana Cabinet Meeting On March 12th 2024
12న తెలంగాణ కేబినెట్ భేటీ
-మేనిఫెస్టోలోని కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్.
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) మార్చి 12న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీకి మంత్రులు, ఉన్నాతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. తొలుత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల టైమ్ లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ వచ్చే ముందే ప్రారంభించాల్సిన పథకాలపై చర్చ.
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను లాంఛనంగా భద్రాచలంలో ప్రారంభించనున్న నేపథ్యంలో హడ్కో నుంచి రూ. 3,000 మేర రుణాలు సమకూర్చుకోడానికి హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మిలోని నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపైనే కేబినెట్ చర్చించి ఆమోదం పొందనున్నది.
Also Read : CM Revanth Reddy Invited to Yadagirigutta Brahmotsavam
వీటికి తోడు విధానపరమైన మరికొన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికల కోడ్ రానుండడంతో ఈ లోపే ఆరు గ్యారంటీల్లో పెండింగ్లో ఉన్నవాటికి మంత్రివర్గం ఆమోదం పొందడంతో పాటు ఆన్-గోయింగ్ స్కీములుగా ఉంచేందుకు ప్రారంభోత్సవాలు చేయాలని అనుకుంటున్నారు.