జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ స్పందన
🔹విపత్కర సమయంలో సమ్మె భావ్యం కాదన్న సీఎం
🔹న్యాయమైన డిమాండ్లైతే పరిగణలోకీ తీసుకుంటాం..
🔹తొందరపాటు చర్యలొద్దని జూడాలకు కేసీఆర్ సూచన..
🔹మొండిగా వ్యవహరిస్తే అందరికీ నష్టమేన్న సీఎం
చాలా రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ను తెలంగాణ కంటే తక్కువగా ఇస్తున్న విషయాన్ని వైద్యాధికారులు సిఎం చంద్రవేఖర్ రావు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సమస్యలు ఏమిటని సిఎం ఆరా తీసారు. అధికారులు సిఎం చంద్రవేఖర్ రావు దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సిఎం నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సిఎం నిర్ణయించారు.కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్థుతం వారి కోరిక మేరకు సత్వరమే అందించాలని అధికారులను సిఎం చంద్రవేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి, సిఎంవో కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ ఎస్ఎఎం రిజ్వీ, డిఎంఈ రమేశ్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు, సిఎం ఓఎస్డీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సమ్మెకు వెళ్తున్న జూనియర్ వైద్యులు మరియు సీనియర్ రెసిడెంట్ వైద్యులతో కలిపి 7000 మంది వైద్యులు చేస్తున్న సమ్మె వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ రోగుల చికిత్సలపై ప్రభావితం చూపుతాయని, ఇది రోగులకు నష్టం కలిగిస్తుందని, ప్రతిపక్షలు అభిప్రాయపడుతున్నారు. సీఎం కెసిఆర్ కోవిడ్ రోగుల పరిస్థితిని అర్థం చేసుకొని పరస్పర పరిష్కారం కోసం జూనియర్ వైద్యులతో చర్చలు జరపాలని డిమాండ్ చేసారు.