Sri Giri Kondapaina Vaibhavanga Mugisina Mahasivaratri Brahmotsavalu
శ్రీ గిరి కొండపైన వైభవంగా ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
– పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడనున్నది.
– ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.
– రధోత్సవం పై స్వామి అమ్మవార దర్శనం.
శ్రీశైలం ( ప్రశ్న న్యూస్) మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నికదీక్షతో పదకొండురోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా, జరిపించబడ్డాయి. అదే విధముగా ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హెూమాలు జరిపించబడుతాయి.
రథోత్సవం:స్వామిఅమ్మవార్ల రథోత్సవం జరిపించబడింది. రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి కార్యక్రమాలు నిర్వహించనున్నది. రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నంరాశి) సాత్వికబలిగా సమర్పించడం జరుగుతుంది. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథం పైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపించబడుతుంది. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలిగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్,
మొదలైన 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించడం జరుగుతుంది. తెప్పోత్సవం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించబడనున్నది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడనున్నది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు నిర్వహించబడుతాయి. తరువాత ఉత్సవమూర్తులను ఆలయరాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలను నిర్వహించబడుతాయి. తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం నిర్వహించబడుతుంది.
Also Read : Shivalayam Lo Niluvu Dopidi
కాగా వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్ప అలంకరణకు గాను ఎరుపుబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, గులాబీలు, కనకాంబరం, ఆస్టర్, జబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్, మొదలైన పుష్పాలను వినియోగించడం జరుగుతుంది.. తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.