Harish Rao

 

కాషాయ దళంపై హరీశ్ రావు విసుర్లు

 

🔹బీజేపీతోనే పోటీ.. కాంగ్రెస్ జాడ లేదు

 

హుజురాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ మాటల యుద్ద కంటిన్యూ అవుతోంది. మంత్రి హరీశ్ రావు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. బై పోల్‌లో టీఆర్ఎస్- బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. బరిలో కాంగ్రెస్ పార్టీ లేదని తెలిపారు. ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదని ఆరోపించారు. ఏ పార్టీ గెలిస్తే హుజురాబాద్ డెవలప్ అవుతుందని భావిస్తారో.. ఆ పార్టీకే ఓటువేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల జీవన ప్రమాణ స్వాయి పెరగలేదా అని అడిగారు. బీజేపీ 24 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని అడిగారు. ఒకవేళ ఇస్తే తాము ఓట్లు అడగబోమని సవాల్ విసిరారు. హుజురాబాద్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. గ్యాస్ సిలిండర్ రాయితీ కూడా తగ్గించారని తెలిపారు. రూ.250 ఉన్న రాయితీని రూ.40కి తగ్గించారని చెప్పారు. గ్యాస్ బండ రూ.410కి నుంచి రూ.వెయ్యికి పెంచారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పెంపు వల్ల రైతులకు ఎకరాకు రూ.3 వేల భారం పడుతుందని చెప్పారు. రాయితీ తీసివేసినా.. గ్యాస్ రూ.వెయ్యి చేసినా ఫరవాలేదని చెప్పారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తామని చెప్పి ఓటు అడగాలని సూచించారు. అందుకే బీజేపీ నేతలు బొట్టుబిళ్లలు, గోడ గడియారాలు పంచుతున్నారని వివరించారు. బొట్టుబిళ్లలకు ఓటు వేస్తారా..? ఆడ పిల్ల పెళ్లికి ఇచ్చే రూ.లక్షతో ఓటు వేస్తారా అని అడిగారు. మీ సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సాయం చేస్తున్నామని వివరించారు. హుజురాబాద్‌లో పూర్తి కానీ ఇళ్లు పూర్తి చేసి.. త్వరలో నిరుపేదలకు అందజేస్తామని వివరించారు.

ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ వదలడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ఆదుకోవడానికి నిధులు కేటాయిస్తోందని చెప్పారు. ఇదివరకు ఇక్కడ 43 వేల మెజార్టీ ఇచ్చారని.. దానిని 50 వేలు చేయాలని కోరారు. దొడ్డు వడ్లు కొనమని చెబుతున్నారు. మార్కెట్లు ఎత్తివేస్తామని చెబుతున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. బీజేపీ వల్ల నష్టమే జరుగుతుందని చెప్పారు. అన్నీ అమ్మేస్తే చివరికీ ఏం మిగులుతుందని అడిగారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన చెప్పారు. బీజేపీ హయాంలో పెరిగిన ధరలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రానున్న రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా వారి సంగతి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికే అర్హులను ఎంపిక చేసి.. నగదు కూడా జమ చేశారు. ఈ క్రమంలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.