ఆనందయ్య ఆయుర్వేద మందు పెద్దలకే నా.? పేదలకు లేదా.?

 

🔹ఇదెక్కడి న్యాయం

🔹మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

 

నెల్లూరు బ్యూరో (ప్రశ్న న్యూస్)  ఆనందయ్య ఆయుర్వేద మందు పెద్దల కనుసన్నల్లో ప్యాకెట్ల ద్వారా వెళ్ళిపోతుందని పేదలకు ఇచ్చే సమయానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
సోమిరెడ్డి నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ పెద్దలకు ఏమో ఆయుర్వేద మందు అవసరం పేదలకు ఏమో అవసరం లేదా.? వారి ప్రాణాలు కాదా ఎందుకింత కక్ష పరిశోధన పేరుతో అడ్డంకులు సృష్టించడం సబబు కాదని తెలిపారు. సివిఆర్ ఫౌండేషన్ ద్వారా పెద్దలకు  ప్యాకెట్లు రూపంలో  వెళ్ళిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ రాములు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ సింఘాల్ మందులు పరిశీలించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా లేవని నిర్ధారించిన పంపిణీకి ఎందుకు వెనుకాడుతున్నారని దుయాబట్టారు. ఆనందయ్య 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్న అలాగే కరోనా ఆయుర్వేద ముందు 70 వేల మందికి పైగా ఇచ్చి ఉన్నారని వారికి ఎలాంటి ఇబ్బంది జరగలేదన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా మందు తీసుకున్నారని చెప్పారు. ఆనందయ్య సౌమ్యుడిగా వాళ్ల తల్లిదండ్రుల ద్వారా ఆయుర్వేద మందు ను తయారు చేస్తున్నారని ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా ప్రభుత్వం పరిశోధనల పేరుతో కాలయాపన చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ప్రజలు అమాయకులు కాదని ప్రభుత్వంపై తిరగబడే  రోజు వస్తుందని ప్రజలు క్షమించరని వీలైనంత త్వరలో 25 మందులు పంపిణీ చేసి పేదలు పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ మందు పంచాలని అందుకు ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయించాలన్నారు. సౌమ్యుడిగా ఉన్న ఆనందం పోలీసు పహారాలో పెట్టి నిర్బంధించి అవమానం పాలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని పరిశోధనల పేరుతో కాలయాపన చేయరాదని కోరారు. కేవలం  సోషల్ మీడియాలో వచ్చిన మాటలను నమ్మవద్దని ఆయుర్వేద మందు పై అనుమానం ఉంటే ఇష్టం లేనివారు మింగాల్చిన అవసరం లేదన్నారు. వెంటనే ప్రజలకు అందుబాటులోకి ఆనందయ్య మందు తీసుకురాకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని ప్రజలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. జగన్ సర్కార్ పేద ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని భారీ స్థాయిలో ఆనందయ్య మందు తయారు చేసి రాష్ట్రం నలుమూలల పంపాలని డిమాండ్ చేశారు.