Allu Arjun at the 13th wedding ceremony
13వ పెళ్లి వేడుకల్లో అల్లు అర్జున్
– భార్య స్నేహ వల్లనే నా ఎదుగుదల అంటూ ఎమోషన్..
అల్లు అర్జున్, స్నేహారెడ్డిల 13వ పెళ్లి రోజు సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బుధవారం ఈ జంట హ్యాపీ మ్యారేజ్ డేను సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లిరోజును పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా ‘నేను ఇంత గొప్పగా మారడానికి నీతో బంధమే కారణం’ అని ఎమోషనల్ గా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అంతేకాదు, ఈ పోస్ట్లో పాటు ఆయన షేర్ చేసిన ఫొటోలు కూడా టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి. అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డిల వివాహం 2011లో జరుగగా.. వారికి అల్లు అయాన్, అల్లు అర్హ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా ‘గంగోత్రి’ సినిమాతో పరిచయమై.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ‘పుష్ప’ సినిమాలోని ఆయన నటనకు ప్రపంచమే నీరాజనాలు పలికింది. ఫలితంగా టాలీవుడికి ఇప్పటి వరకు రాని, లేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ సాధించిపెట్టారు.
Also Read : Devara Movie Janhvi Kapoor New Look Poster
అయితే ఈ కీర్తి ప్రతిష్టలకు కారణం తన భార్య స్నేహారెడ్డితో ఉన్న బంధమే కారణమంటూ అల్లు అర్జున్ తన తాజా పోస్ట్లో చెప్పుకొచ్చారు. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మన పెళ్లి జరిగి 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. నా ఈ అభివృద్ధికి నీతో ఈ బంధమే కారణం. నీ ప్రశాంతతతో నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్.. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను..’ అంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోని, అలాగే తన పెళ్లి నాటి మరో ఫొటోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.