Bastar Movie from Kerala Story House
కేరళ స్టోరీ హౌజ్ నుంచి బస్తర్ మూవీ
గతేడాది ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో సంచలన విజయం అందుకుంది ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ. ఇక ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం ఆదాశర్మ మళ్లీ కేరళ స్టోరీ చిత్ర యూనిట్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆదాశర్మ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ “Bastar: The Naxal story”, ఈ సినిమాకు కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తుండగా.. విపుల్ అమృత్లాల్ షా, ఆషిన్ ఎ షా నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల అమానుషాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
Also Read : Allu Arjun at the 13th wedding ceremony
ఇక ఈ సినిమాలో మావోయిస్టులను పట్టుకునే ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్ పాత్రలో ఆదా శర్మ కనిపించనుంది. ఐసిస్, బోకోహరామ్ల తర్వాత ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన తీవ్రవాదులు మావోయిస్టులే’, పాకిస్థాన్తో జరిగిన యుద్దాల్లో కన్నా.. మావోయిస్టుల కారణంగానే చనిపోయిన సైనికులే ఎక్కువ.. అంటూ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా సాగాయి.