Natulaku Athma Gouravam Mukhyam

నటులకు ఆత్మగౌరవం ముఖ్యం

-కంగనా పోస్ట్స్ మరోమారు మంటలు..

నిత్యం ఏదో ఓ వివాదంలో ఉండే ‘కంగనా రనౌత్ / Kangana Ranaut’ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఇనైరెక్ట్గా తన ఇండస్ట్రీపైన, సెలబ్రిటీలపైనే సెటైర్లు వేసి బాలీవుడ్లో మంట లేపింది. ఇప్పుడు ఈ విషయం హిందీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఏ విషయం మనసులో దాచుకోకుండా మోహం మీద కొట్టినట్లు చెప్పే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటులకు ఆత్మగౌరవం ముఖ్యమంటూ ఓ పోస్టు పెట్టి అగ్గి రాజేసింది. విషయానికొస్తే..

Natulaku Athma Gouravam Mukhyam

ఈ మధ్య గుజరాత్లోని జామ్ నగర్లో అంబానీ ఇంట్లో అనంత్, రాధికల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకుదే, విదేశాల నుంచి చాలా మంది పెద్ద ప్రముఖులు హజరైన సంగతి తెలిసిందే. అదేవిధంగా బాలీవుడ్ నుంచి కూడా దాదాపు టాప్ స్టార్స్ హీరో హీరోయున్స్ అందరు పాల్గొనడమే కాక ఆడి పాడారు. ఆ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అయ్యాయి.

Also Read : Devara Movie Janhvi Kapoor New Look Poster

అయితే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ క్వీన్గా పేరు సంపాదించుకున్న కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ పార్టిసిపేట్ చేయలేదు కానీ పరోక్షంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కామెంట్లు చేసింది. దీంతో ఈ అంశం నార్త్ లో బాగా చర్చనీయాంశం అవుతోంది. అసలు ఆమె సోషల్మీడియాలో పెట్టిన పోస్టు సారాంశం ఏంటంటే..

ప్రతి ఒక్కరికి డబ్బుకంటే ఆత్మగౌరవం ముఖ్యమని నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ను చంపుకోలేనంటూ గతంలో లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను కంగనా రనౌత్ గుర్తు చేసింది. గతంలో లతా మంగేష్కర్ గారు చెప్పిన మాటలను నేను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తానని, అవతలి వారు ఎంత ధనవంతులైనా వారెంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పి తను మరణించేంత వరకు ఆ మాట మీదనే ఉందన్నారు.

నేను పుట్టి ఈ స్థాయికి వచ్చేంత వరకు కూడా ఆర్థికంగా చాలా ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, అవతలి వాళ్లు కోట్లలో డబ్బు ఇస్తామని చాలా సార్లు ఆఫరిచ్చినా వేరే వాళ్ల వేడుకల్లో డ్యాన్సులు చేయలేదని, చివరకు ఐటమ్ సాంగ్స్ కూడా చేయలేదని కంగనా రనౌత్ స్పష్టం చేశారు.