Positive Talk Sontham Chesukunna Bhimaa

పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భీమా

Positive Talk Sontham Chesukunna Bhimaa-ప్రేక్షకుల ఆదరణ మరువలేనిదన్న గోపీచంద్..

గోపీచంద్ కథానాయకుడిగా ఎ. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమా/Bhimaa’. తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో చిత్రబృందం ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది. ‘మంచి సినిమాను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కథకు నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాలో నరేశ్ పాత్రకు మంచి ఆదరణ వచ్చింది.

ఆయన స్క్రీన్పై కనిపిస్తున్నంత సేపు చప్పట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులోని డైలాగులు,+ట్లు, మ్యూజిక్ ఇలా ప్రతిదాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. తెరపై చూస్తే అది అర్థమైంది. నాకు వ్యక్తిగతంగా కామెడీ అంటే ఇష్టం. ఇందులో ఫస్టఫ్తా సన్నివేశాలు అందరికీ 25°/0° నచ్చాయి. నరేశ్, నాకు మధ్య సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడే తెగ నవ్వొచ్చేది. కాసేపు పక్కకు వెళ్లి నవ్వుకొని
వచ్చేవాడిని.

Also Read : Nedu Kannappa First Look Vidudala

నేను షూటింగ్ సమయంలో ఎంత ఎంజాయ్ చేశానో ఇప్పుడు ప్రేక్షకులు కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి హాయిగా నవ్వుకోండి’ అని గోపీచంద్ అన్నారు. ‘నిన్న సినిమా విడుదలైన దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నా పాత్ర బాగుందని మొదట ఓవర్సీస్ నుంచి ఒకరు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడి ప్రేక్షకుల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. సంక్రాంతి, దసరా సినిమాల లాగా ‘భీమ్’ శివరాత్రి సినిమా’ అని నటుడు నరేశ్ అన్నారు.