Suhas Prasanna Vadanam
సుహాస్ ప్రసన్నవదనం
టాలీవుడ్ నటుడు ‘సుహాస్ / Suhas’ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ముందుకువస్తున్నాడు. సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తుండగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్పై మణికంఠ ఏ+ూ, ప్రసాద్ రెడ్డి ఖీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ గమనిస్తే.. సుహాస్ ఈ సినిమాలో ఫేస్ బ్లెండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి వచ్చిన వారు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుపడతారు.
Also Read : Bastar Movie from Kerala Story House
అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్కు అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.