Nedu Kannappa First Look Vidudala
నేడు కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న తాజా సినిమా ‘కన్నప్ప’ దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్లో జరుగుతుంది. ఇక అత్యంత భారీ బ్లడెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read : Devara Movie Janhvi Kapoor New Look Poster
తాజాగా మూవీ నుంచి మేకర్స్ ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మహా శివరాత్రి కానుకగా.. మార్చి 08 మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. కన్నప్ప మొదట నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారతాడు. ఇక అతడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే భక్త కన్నపస్ప పేరుతో కృష్ణంరాజు గతంలోనే హిట్ సినిమా అందించారు.