CAA is Not Anti-Muslim

సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదు

– వెనక్కి తీసుకునే అవకాశమే లేదు..

CAA is Not Anti-Muslim

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు రగడ నడుస్తోంది. సీఏఏపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తేల్చి చెబుతుండగా అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలకు ముందు దేశంలో ఈ పౌరసత్వ సవరణ చట్టం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ సీఏఏపై ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ముస్లిం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించకపోవడమే. ఈ క్రమంలోనే కేంద్ర హెం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం శరణార్థులు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

అయితే వారికి పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనే దానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉందని తెలిపారు. తాజాగా ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన అమిత్ షా ముస్లిం శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అందుకోసం రాజ్యాంగంలో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉందని స్పష్టం చేశారు. వారు కూడా భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే జాతీయ భద్రత సహా ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని వారికి పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. సీఏఏపై ప్రతిపక్షాలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Also Read : The Citizenship Amendment Act came into force (CAA)

ఇప్పటివరకు పౌరసత్వ సవరణ చట్టం గురించి వివిధ వేదికలపై కనీసం 41 సార్లు తాను ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు అమిత్ షా వెల్లడించారు. భారతదేశంలోని మైనారిటీలు ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసినట్లు చెప్పారు. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంలో ఏ పౌరుడి హక్కులను లాక్కునే నిబంధన లేదని అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగానే సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు, ఇతర వర్గాలు ఎన్ని ఆందోళనలు చేసినా చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సీఏఏ
రాజ్యాంగ విరుద్ధం అంటూ చేస్తున్న విమర్శలను కూడా అమిత్ షా తిప్పికొట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ను పౌరసత్వ సవరణ చట్టం ఉల్లంఘిస్తుందని కొందరు చెబుతున్నారన్న అమిత్ షా అదంతా అబద్ధమేనని కొట్టిపారేశారు. దేశ విభజన కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉండి మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి రావాలని భావిస్తున్న అక్కడి మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడమే ఈ చట్టం లక్ష్యమని
అమిత్ షా తెలిపారు.

దేశంలోని పౌరులకు సీఏఏతో ప్రమాదమని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయన్న అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టంలో భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఉన్న ఒక క్లాజును చూపించాలని ప్రతిపక్ష నేతలకు సవాలు చేశారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. 2019 లో పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మార్గం సుగమం అయింది. 2014 డిసెంబర్
31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.