Hash Tag Vadakamlo Prabhas Record

హ్యాష్ ట్యాగ్ వాడకంలో ప్రభాస్ రికార్డ్

Hash Tag Vadakamlo Prabhas Record ప్రభాస్/Prabhas ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటే కాదు సోషల్ మీడియాలోనూ ఆయనకున్న క్రేజ్ వేరు. ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఆయన తాజాగా ఓ అరుదైన రికార్డు దక్కించుకున్నారు. ట్విట్టర్లో గతేడాది ఎక్కువ వాడిన హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో ప్రభాస్ పేరు టాప్ ప్లేస్లో ఉంది.

సంవత్సరంపాటు మన దేశంలో నెటిజన్లు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్ ట్యాగ్లను ఎక్స్ తాజాగా ప్రకటించింది. ‘టాప్ హ్యాష్యాగ్స్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఎంటర్టైన్ మెంట్ విభాగంలో ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ ఏడో స్థానంలో ఉంది. అలాగే ఆయన నటించిన ‘ఆదిపురుష్’ తొమ్మిదో ప్లేస్లో ఉండటవ విశేషం. ఈ లిస్ట్లో ఉన్న ఏకైక హీరో ప్రభాస్ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Sai Dharam Tej Kotta Avataram

ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో ‘సలార్ పార్ట్ 2/Salar Part 2’ రూపొందనుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ/Kalki 2898 AD’ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దీనితో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ రూపొందుతోంది. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాల తర్వాత సందీప్డ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్’లో నటిస్తారు.