జగన్ సక్సెస్ సీక్రేట్ ఏంటి.? సీఎం ఫిట్ నెస్ వెనుక రహస్యం.?
🔹ఆ చిరునవ్వు..ఒత్తిళ్లు ఎలా ఫేస్ చేస్తారు..
🔹జగన్ రోజు వారీ షెడ్యూల్…ఫుడ్ మెనూ..
🔹పరిమిత ఆహారం..ఫ్రూట్స్ కు ప్రాధాన్యం
🔹వీక్ ఎండ్ లో పూర్తిగా ఫ్యామిలీతో..
అమరావతి (ప్రశ్న న్యూస్) ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజకీయాల్లో పడి లేచిన కెరటం. పదేళ్ల కష్టంతో సీఎం పీఠం సొంత చేసుకున్న నేత. సుదీర్ఘ పాదయాత్రతో రికార్డు క్రియేట్ చేసిన జగన్…ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలమైన పొలిటీషియన్ గా ఎదిగారు. 2009 లో ఎంపీగా గెలిచినా… తండ్రి మరణంతోనే రాజకీయంగా కీలక బాధ్యతలు మెదయ్యాయి. సీబీఐ కేసులు…రాజకీయ ఒత్తిళ్లు..ఆర్దిక సమస్యలు..పార్టీలో వ్యవహారాలు.. మరో వైపు పాదయాత్ర..ఇలా అన్నింటినీ జగన్ బ్యాలన్స్ చేసుకున్నారు. ఒక వైపు చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ తో తలపడుతూ..మరో వైపు తన పైన పెట్టిన కేసులతో ఫైట్ చేస్తూ.. పార్టీని కాపాడుకోవటానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.
మరి..జగన్ ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించటానికి కారణం ఏంటి. ఇన్ని రకాల ఒత్తిళ్లు ఎలా ఎదుర్కొంటారు. ఆయన అంత ఫిట్ గా ఉండటానికి ఎటువంటి ఆహారం తీసుకుంటారనే ఆసక్తి పార్టీలో..ప్రభుత్వంలోనూ అప్పుడప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది. వైఎస్సార్ వైద్యుడు కావటంతో ఆయన కుటుంబలో సహజంగానే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఆహారం…వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తారు. చిన్నప్పటి నుండి జగన్..షర్మిల..భారతి ఇదే విధంగా ఆహారం విషయంలో..యోగా వంటి అంశాల్లోనూ కామన్ గా ఉంటారు. అయితే, జగన్ పెరిగింది ..వ్యాపారాల రీత్యా ఉన్నది హైదరాబాద్..బెంగుళూరు అయినా.. పక్కా రాయలసీమ గ్రామీణ ఆహారం ఎక్కువగా ఇష్ట పడతారు.
సీఎం జగన్ దిన చర్య ఉదయం 4.30 గంటలకు ప్రారంభం అవుతుంది. నిత్యం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు యోగా.. జిమ్ చేస్తారు. 5.30 గంటల నుండి గంట సేపు వార్తా పత్రికలు…నిఘా నివేదికలు..అర్జంట్ నోట్స్ కోసం కేటాయిస్తారు. ఆ సమయంలో ఒక్క టీ మాత్రమే తీసుకుంటారు. ఇక, ఏడు గంటలకు ఒక జ్యూస్ తీసుకుంటారు. అంతే, ఆయన బ్రేక్ ఫాస్ట్ తీసుకోరు. పాదయాత్ర సమయంలోనూ జగన్ ఇదే విధంగా ఉదయం సమయంలో ఒక జ్యూస్ మాత్రమే తీసుకొనే వారు. ఇప్పుడ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఉదయాన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ తో పాటుగా అల్లంతో చేసిన టీ తీసుకుంటారు. ఇక, ఇంటలిజెన్స్..సీఎస్ తో పాటుగా సీఎం కార్యాలయ అధికారులతో తాజా అంశాల పైన సమీక్ష నిర్వహిస్తారు.
ఇక, రివ్యూల సమయంలో చాక్లెట్ బైట్స్ మాత్రమే తీసుకుంటారు. లంచ్ లో అన్నం కంటే పుల్కాలకు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని రకాల కూరగాయలు అందులో కూరగా ఇష్టపడతారు. ఇక, నాన్ వెజ్ లో మటన్ కీమా..రాగి ముద్ద అప్పుడప్పుడు లంచ్ లో మెనూగా ఉంటుంది. జగన్ సీమ చిత్రాన్నం అంటే ఎక్కువగా ఇష్టపడతారు. అదే విధంగా మధ్నాహ్నం అన్నంలో కుండ పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక, మంచి నీరు మాత్రం జగన్ ఎక్కువగా తీసుకుంటారు. సాయంత్రం సమయంలో కేవలం టీ మాత్రమే స్వీకరిస్తారు.
ఎక్కువగా ఫ్రూట్స్..జ్యూస్ లకే ప్రాధాన్యత ఇస్తారు. ఇక, మొక్కజొన్న పొత్తులు..పల్లీలు అంటే జగన్ కు బాగా ఇష్టం. ఖాళీగా ఉన్న సమయంలో వాటిని తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇక, వీడ్ ఎండ్ లో మాత్రం పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తారు. ఆదివారం బిర్యానీ..చేపల పులుసు సీమ టేస్టుల్లో రెడీగా ఉంటుంది. యోగా ద్వారా ఒత్తిడి దరి చేరకుండా..మితమైన ఆహారం ద్వారా అనారోగ్యం రాకుండా.. పాజిటివ్ ఆలోచనలతో సక్సెస్ బాట పట్టటమే జగన్ అసలైన విజయ రహస్యంగా అత్యంత సన్నిహితులు చెబుతారు.