భూకబ్జా ఎమ్మెల్యే భేతి పై సీఎం కేసీఆర్ చర్యలేవి.?

🔹రెడ్డి సామాజిక వర్గానికి ఓ న్యాయం.. బీసీ సామాజిక వర్గానికి మరో న్యాయమా.?
🔹ఉప్పల్ ఎమ్మెల్యే భేతి, తహాశీల్దార్ గౌతమ్ కుమార్ ల కబ్జాలు మరిన్ని వెలుగులోకి.?
🔹ఎమ్మెల్యే,తహాశీల్దార్ కనుసన్నల్లో హెచ్ఎంటి నగర్ బఫర్ జోన్ కబ్జా
🔹బఫర్ జోన్ కబ్జాలో స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ కీలకపాత్ర.?

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడి అత్యున్నతమైన స్థానం శాసనసభకు వెళ్ళిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాస్ రెడ్డి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వ అధికారిగా ఎంపికై కాప్రా తహాశీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ కుమార్( ట్రెస్సా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతూ) అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ఆ అధికారి ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇరువురు ఒకటై ఇక ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిన్న కాప్రా సర్కిల్ లో పట్టేదారు భూములపై 152 సర్వే నెంబర్లో 90 ఎకరాల పై కన్నేసి సమస్యను పరిష్కరించాలంటే మాకు భూమి అయిన కావాలి. కొన్ని కోట్ల రూపాయలు అయినా కావాలి. అని ఎమ్మెల్యే చెప్పడం అందుకు కాప్రా తహాశీల్దార్ గౌతమ్ కుమార్ ఊతం పలకడం పాస్ బుక్కులు కావాలంటే ఎమ్మెల్యే చెప్పిన ప్లాన్ ను అమలు చేస్తే అందుకు తాను ఓకే నని చెప్పి పటేదార్ ప్రతినిధి అయిన అడ్వకేట్ మేకల శ్రీనివాస్ యాదవ్ తో బేరసారాలు కుదుర్చు కోవడంతో అందుకు ససేమిరా అన్న పట్టేదార్ ప్రతినిధి వారిరువురు పై ప్రైవేట్ కేసు కోర్టులో పైల్ చేసి వారిపై కేసులు పెట్టి వారిని కటకటాల పాలు చేసిన విషయం విదితమే. ఇటీవల ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లో హెచ్ఎంటి నగర్ చెరువులో బఫర్ జోన్ కబ్జా లో స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, తహాశీల్దార్ గౌతమ్ కుమార్,స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ హస్తం ఉందని స్థానికులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం ఆయా దినపత్రికల్లో వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి బఫర్ జోన్ కబ్జా చేసి అక్రమంగా నిర్మాణము చేపట్టినప్పుడు స్థానికులు ఎన్ని ఫిర్యాదులు చేసినా సంబంధిత తహాశీల్దార్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉప్పల్ ఎమ్మెల్యే నోరు మెదపక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఈటల రాజేందర్ మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి నుండి తొలగించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే పై భూ ఆక్రమణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో ప్రజలు వేచి చూస్తున్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలో.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, తహాసిల్దార్ గౌతమ్ కుమార్ కబ్జాలు ఆలస్యంగా ఒక్కోక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లో హెచ్ఎంటి నగర్ చెరువు బఫర్ జోన్ కబ్జా లో స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, తహసిల్దార్ గౌతమ్ కుమార్,స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి బఫర్ జోన్ కబ్జా చేసి అక్రమంగా నిర్మాణము చేపట్టినప్పుడు స్థానికులు ఎమ్మార్వో గౌతమ్ కుమార్ కు,స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కి, జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఖుద్దూస్ కు ఫిర్యాదు చేసిన కనీసం స్పందించకపోవడం పై ప్రజలు విస్మయానికి గురయ్యారు. టౌన్ ప్లానింగ్ ఏసిపి ఖుద్దూస్, ఉప్పల్ తహసిల్దార్ గౌతమ్ కుమార్ కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, నోటీసులు ఇచ్చామని, కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేసి అక్రమ నిర్మాణం పూర్తయ్యేలా పూర్తిగా సహకరించారే తప్పా, బఫర్ జోన్ కబ్జా చేసి నిర్మించిన నిర్మాణం మాత్రం కూల్చివేయకపోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హస్తం ఉందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా వెలుగులోకి రాని ఎన్నో కబ్జాలు ఎన్నో అక్రమాలు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, తహసిల్దార్ గౌతమ్ కుమార్ లపై ఉన్నాయో అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎంటి నగర్ బఫర్ జోన్ కబ్జా వెనుక స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ కీలకపాత్ర వహించినట్లు భారీగా నగదు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చేతులు మారినట్లు గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నిసార్లు పత్రికల్లో వచ్చిన తహసిల్దార్ గౌతమ్ కుమార్, కాప్రా సర్కిల్ ఏసీపీ ఖుద్దూస్ నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈరోజు బఫర్ జోన్ కబ్జా జరిగిందని ఇందుకు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారణమని తెలుస్తుంది. పత్రికల ప్రతినిధులతో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ భూములను రక్షించడం నా బాధ్యత అని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యేకు నాచారం హెచ్ఎంటి నగర్ బఫర్ జోన్ కబ్జా చేసినప్పుడు తెలియదా.? ఈరోజు తన కబ్జా బాగోతం బయటికి రాగానే తనకేమీ తెలియదన్నట్టు నటించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే, తాసిల్దార్ అక్రమాలు చేయకుంటే కేసు నమోదు అయ్యేది కాదని,వీళ్ళ అక్రమాలు, అవినీతికి పూర్తి సాక్ష్యాధారాలు ఉండడం వల్లే తహసిల్దార్ గౌతంకుమార్ పై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పై కోర్టు కేసు నమోదు చేయాలని సూచించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ప్రజలు తెలుపుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేటర్ లే కబ్జాదారులుగా మారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తెలంగాణ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలపై ఆగమేఘాల మీద స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, తహసిల్దార్ గౌతమ్ కుమార్ పై ఎలా స్పందిస్తారో అని ప్రజలు వేచి చూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో బిసి ఎమ్మెల్యేలకు ఒక రూల్.. అగ్రవర్ణ ఎమ్మెల్యేలకు మరో రూల్ ఉంటుందో లేదో రెండు రోజుల్లో తేలిపోతుంది.